Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెకండ్ షెడ్యూల్ పూర్త‌యిన లక్ష్ చదలవాడ ధీర

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (17:02 IST)
Dheera
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్  కమర్షియల్ జానర్‌లో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు', 'ధీర' సినిమాలు చేస్తున్నారు.  చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ  ఈ రెండు సినిమాలను  నిర్మిస్తున్నారు. 
 
ఓ విలక్షణ కథకు కమర్షియల్ హంగులు జోడించి పవర్‌ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ధీర మూవీకి విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇవ్వడమే గాక.. విడుదలకు ముందే 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' మ్యూజిక్‌తో ఆడియన్స్ చేత భేష్ అనిపించుకున్న సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ వైజాగ్ లో  పూర్తిచేశారు. విశాఖలోని అందమైన ప్రదేశాల్లో ఓ సాంగ్ చిత్రీకరించడంతో పాటు చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ షెడ్యూల్ లో షూట్ చేసిన అన్ని సన్నివేశాలు చాలా బాగా రావడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
 
క్లాస్, మాస్ ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు  జోడిస్తూ ఈ ధీర సినిమాను రూపొందిస్తున్నారు. మిగిలిన కొంతభాగాన్ని అతిత్వరలో కంప్లీట్ చేసి చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  హీరో లక్ష్ నటించిన మరో సినిమా 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' ఈ నెల 24 న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ అప్ డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. 
 
సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం:  విక్రాంత్ శ్రీనివాస్, నిర్మాత‌:  చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి,  సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి. సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిట‌ర్‌: మధు బీడీ, డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, ఆర్ శృతిక్, ప్రొడక్షన్ కంట్రోలర్: అక్కినేని శ్రీనివాస రావు ,పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments