Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపుస్తకం తరువాత నా కెరీర్ లో ఆ స్థాయి చిత్రం లగ్గం : డా రాజేంద్రప్రసాద్

డీవీ
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (15:44 IST)
Dr. Rajendra Prasad, Sai Ronak
సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు  రచన -దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్, గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
 
ఈ సందర్భంగా డా . రాజేంద్రప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ...లగ్గం సినిమాలో ఎవ్వరు, ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్ లో పెళ్లిపుస్తకం తరువాత అంత గొప్ప పాత్ర ఈ సినిమాలో చేస్తుండడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఈ కథ కథనాలు కనెక్ట్ అవుతాయి. "లగ్గం విందు భోజనం" లాంటి సినిమా అన్నారు.
 
దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ,  "పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు.  రెండు మనసులు కలవడం." అంటూ  గట్టి దావత్ ఇవ్వబోతున్నాo. అన్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.  బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్. బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
ఫిబ్రవరి 5నుండి పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. "ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నాము. ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, తెలంగాణ పెళ్లి కల్చర్  ప్రతి ఒక్కరికి  వాళ్ళ లగ్గాన్ని గుర్తుచేస్తుంది. పెళ్ళి కాని వారికి ఇలా లగ్గం చేసుకోవాలనిపిస్తుంది." అన్నారు హీరో సాయి రొనక్. 
 
నటీనటులు: సాయి రోనక్, గనవి లక్ష్మణ్, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు,  రఘుబాబు, రచ్చ రవి,  కనకవ్వ,  వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న , తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments