Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాక్టర్ సి.హెచ్. ప్రీతి రెడ్డికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు

Advertiesment
Preeti Reddy received Dr. C.H. Champions of Change 2024 Award from K. G. Balakrishnan

డీవీ

, సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (15:29 IST)
Preeti Reddy received Dr. C.H. Champions of Change 2024 Award from K. G. Balakrishnan
ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ వారు చేసే సేవలకు గాను అందించే ఒక ఉన్నత పురస్కారం. గతంలో ఈ అవార్డును ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఉత్తరప్రదేశ్ ఫార్మర్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ జి కి, ఇండియన్ ఫిలిం యాక్టర్ శిల్పా శెట్టి కి, ఇండియన్ ఫిలిం యాక్టర్ సోను సూద్ కి, పద్మభూషణ్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కి వారు చేసిన సేవలు అందించబడినది.
 
నేడు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్. ప్రీతి రెడ్డి చేసిన సేవకులను ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డును అందుకున్నారు.  ఘనంగా ఏర్పాటు చేసినటువంటి అవార్డు ఫంక్షన్లో ఫార్మర్ చీఫ్ జస్టిస్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఎన్ హెచ్ ఆర్ సి ఇండియా కే. జీ. బాలకృష్ణన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
 
డాక్టర్ సి. హెచ్. ప్రీతి రెడ్డి గారు మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ గా వైద్య విద్యారంగంలో అందరికీ మంచి ఆరోగ్యం అందించడంలో తనదైన ముద్రను వేసుకుంటున్నారు. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ గా అందరికీ ముఖ్యంగా మహిళలకు ఉన్నత విద్యను అందించడంలో సహాయపడుతున్నారు. మల్లారెడ్డి హెల్త్ సిటీలో రెండు మెడికల్ కాలేజీలు రెండు డెంటల్ కాలేజీలు అదేవిధంగా మల్లారెడ్డి మహిళా కాలేజ్ ఉన్నాయి. ప్రత్యేక ప్రతి మెడికల్ కాలేజ్ నుంచి 200 ఎంబిబిఎస్ సీట్లు ప్రత్యేకంగా ఆడవారి కోసమే కేటాయించబడతాయి. అత్యున్నత వైద్య సదుపాయాలతో మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ప్రీతి రెడ్డి డైరెక్టర్గా ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ తెలంగాణలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీగా పేరుగాంచింది. అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ కింద స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ హెల్త్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లాంటి సిక్స్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతిఏటా యూనివర్సిటీ ద్వారా 5000 మందికి అడ్మిషన్ సీట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. మల్లారెడ్డి గారి కోడలుగా, మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ గా, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ గా వైద్య, విద్యా రీత్యా ప్రజలకు, విద్యార్థులకు ఎనలేని సేవలు అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోటీ పరీక్షల ప్రశ్నపత్రం లీక్ చేస్తే పదేళ్ల జైలు : లోక్‌సభలో కొత్త బిల్లు