Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతి ఇంటికి ఒక మిథున రాశి స్త్రీ అవసరమట..

Advertiesment
Gemini

సెల్వి

, సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (13:41 IST)
మిథునరాశిలో జన్మించిన మహిళా జాతకులు బుద్ధికుశలతను కలిగివుంటారు. విజ్ఞాన సంబంధిత రంగాల్లో రాణిస్తారు. వీరికి ఇతరులను మోసం చేసే గుణం వుండదు. విశ్వసనీయత వుంటుంది.  స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. విద్యావంతులై వుంటారు. 
 
ఎల్లప్పుడూ స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. పెద్దల కుదిర్చిన వివాహం చేసుకుంటారు. ప్రేమలో పెద్దగా నమ్మకం వుండదు. ప్రాక్టికల్‌గా వుండరు. ఇతరుల మాయమాటలు నమ్మరు. 
 
కుటుంబం పట్ల ప్రేమ వుంటుంది. బాధ్యతగా వ్యవహరిస్తారు. వాక్చాతుర్యతను కలిగివుంటారు. నాలుగు మాటలు మాట్లాడాల్సిన చోట ఒకే మాట మాట్లాడతారు. కౌన్సిలింగ్‌లో దిట్ట. ఆదాయం లేకుండా ఏ పని చేయరు. వీరికి అడ్వెంచర్ ఇష్టం. తీర్థయాత్రలు, విహారయాత్రల పట్ల ఆసక్తి చూపుతారు. మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ప్రతి ఇంటికి ఒక మిథున రాశి స్త్రీ అవసరం అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. 
 
మిథున రాశి మహిళలు బాధ్యతగా వ్యవహరిస్తారు. ఉత్తమ ఇల్లాలిగా రాణిస్తారు. మిధున రాశి స్త్రీలు జ్ఞానవంతులు. ఏ పరిస్థితుల్లోనూ ఓపికతో ఉంటారు. చిరునవ్వుతో పలకరిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-02-2024 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్ప సిద్ధి..