Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినిమాను అగ్ర‌స్థానంలో నిలిపిన కేవీ రెడ్డి

Webdunia
గురువారం, 1 జులై 2021 (12:55 IST)
KV reddy- Savitri
జూలై 1న కేవీ రెడ్డి జయంతి. ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు. తెలుగు సినిమాలో వున్న అన్ని క‌థ‌ల‌ను తీసిన ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ కె.వి.రెడ్డి. పూర్తిపేరు కదిరి వెంకటరెడ్డి. స్క్రీన్ ప్లే రచయిత కూడా. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. 
 
పాతాళ‌భైర‌వి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందింది. 200రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అదే. 10 సెంట‌ర్ల‌లో వంద‌రోజులు, 5 సెంట‌ర్ల‌లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా త‌మిళంలో కూడా విడుద‌లై అఖండ విజ‌యాన్ని సాధించింది.  ఇక ఆయ‌న నేతృత్వంలో రూపొందిన `మాయాబ‌జార్‌` ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్‌. అందులో శ్రీ‌కృష్ణుడు అవ‌తారంలో ఎన్‌.టి.ఆర్‌.కు ఓ మైలురాయిలా నిలిచింది. ఈ సినిమా ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ఎవ‌రెస్ట్‌లా నిలిచింద‌నే చెప్పాలి. తొలి చిత్రం ‘భక్త పోతన’లోనే తెలుగు సినిమాకు కావలసిన కొత్త గ్రామర్ ను తీసుకు వచ్చారు  చారిత్రక, జానపద, పురాణాలు, సాంఘికాలతో ఆయ‌న ప్ర‌యోగాలు చేశారు. గూడవల్లి, బి.యన్.రెడ్డి వంటివారు కూడా తెలుగు సినిమా గ్రామర్ ను మార్చారు. వారికన్నా మిన్నగా కేవీ రెడ్డి బోధించిన సినిమా వ్యాకరణం జనానికి భలేగా పట్టేసింది. ‘జై పాతాళభైరవీ’ అన్నారు. అమ్మవారు, ‘నరుడా ఏమి నీ కోరిక’ అని ప్రశ్నించారు. జనాన్ని మెప్పించే చిత్రాలను తీయాలన్నదే తన అభిలాష అని చెప్పినట్టుంది. 
 
‘సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము’ వంటి చిత్రాలు చూసి, ఇవి కేవీ తీసిన సినిమాలేనా అని ఆ రోజుల్లో ఆశ్చర్యపోయిన వారున్నారు. కాల‌క్ర‌మేణా ఆయ‌న సినిమాలు కొంద‌రినీ ఆక‌ట్టుకోలేక‌పోయాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం త‌ర్వాత ఆయ‌న సినిమాలు పెద్ద‌గా ఆద‌ర‌ణ నోచుకోలేక‌పోయాయి. జానపదాల ప్రసక్తి వచ్చిన ప్రతీసారి కేవీ బాణీ కోసం వెదుక్కోవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఈ నాటి సినీజనానికీ తప్పడం లేదు. ఆయ‌న సినిమాలు ఎప్ప‌టినీ ఎవ‌ర్‌గ్రీనే. అందుకే మ‌హాన‌టి సినిమాలో కె.వి.రెడ్డి పాత్ర‌ను ద‌ర్శ‌కుడు క్రిస్ పోషించి గుర్తు చేశారు. విజ‌య‌వంత‌మైన సినిమాలు తీసిన ఆయ‌న 1972 సెప్టెంబ‌ర్ 15న కాలం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments