Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ - ముఖ్య అతిథులుగా...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:52 IST)
హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సాగర్ చంద్ర కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. దగ్గుబాటి రానా విలన్‌. రావు రమేష్, సముద్రఖని, నిత్యామీనన్, సంయుక్తా మీనన్‌లు ఇతర పాత్రలను పోషించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. 
 
ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21వ తేదీ రాత్రి నిర్వహించాలని తొలుత ప్లాన్ చేశారు. కానీ, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆయన మృతికి సంతాప సూచకంగా ఈ వేడుకను వాయిదా వేశారు. 
 
అయితే, ఈ నెల 23వ తేదీ బుధవారం హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు నిర్వహించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. 
 
మరోవైపు 'భీమ్లా నాయక్' ట్రైలర్‌ను సోమవారం రాత్రి రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఏడు మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. కాగా, ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు నటించగా, తమన్ సంగీతం సమకూర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments