Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీ బర్త్‌డే టు కృతిశెట్టి : వరుస ఛాన్సులతో బేబమ్మ బిజీ

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (09:40 IST)
కన్నడనాట నుంచి తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన భామ కృతి శెట్టి. తన తొలి చిత్రంతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన "ఉప్పెన" చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హీట్ సాధించడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో బేబమ్మగా స్థిరపడిపోయారు. 
 
కృష్ణ - నీతి అనే దంపతులకు కృతిశెట్టి గత 2003 సెప్టెంబరు 21వ తేదీన ముంబైలో జన్మించారు. నాటకం రంగంలో డిప్లొమా కోర్సు పూర్తి చేసిన కృతి.. 'ప్రీతి' అనే పేరుతో నాటకంలో కూడా నటించింది. ఇందులో 'సదరమే' అనే పాత్రను పోషించి మంచి పేరు సంపాదించుకుంది. 
 
నటనలోకి రాకముందు ఆమె తన పేరును సంఖ్యాశాస్త్రం ప్రకారం "అద్వైత"గా మార్చుకుంది, కానీ ప్రజలు ఆ పేరును ఉచ్చరించే విధానం ఆమెకు నచ్చలేదు. ఆమె 2013లో తన స్క్రీన్ పేరును అద్వైత నుండి తన పేరును కృతిశెట్టిగా మార్చుకుంది. చిన్నప్పటి నుండి ఈమె పార్లే, ఐడియా, ఫ్యాషన్ అన్‌లిమిటెడ్, క్లీన్ అండ్ క్లియర్, డైరీ మిల్క్ చాక్లెట్ టీవీ కమర్షియల్స్ వంటి అనేక ప్రకటనలలో కనిపించింది.
 
2019లో 'సూపర్ 30' చిత్రంలో బాలీవుడ్‌లో విద్యార్థిగా చిన్న పాత్రతో కృతి తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 2021లో, 'ఉప్పెన' చిత్రంతో, కృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది, ఇందులో ఆమె 'సంగీత అకా బేబమ్మ' పాత్రను పోషించింది. 
 
ఈ చిత్రం సూపర్ డూపర్ విజయం సాధించడంతో పాటు కృతిశెట్టికి బేబమ్మగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఫలితంగా ఆమె ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆమె 'శ్యామ్ సింగారాయ్', నిఖిల్ నటించిన '18 పేజీలు', హీరో రామ్ నటించిన 'ది వారియర్' వంటి చిత్రాల్లో నటించారు. 
 
తాజాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా ఆమెకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఇందులోని పాత్ర ఆమెను ప్రేక్షకులు బాగా లైక్ చేస్తున్నారు. సుధీర్‌బాబు సరసన కథానాయికగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'కెరీర్‌ ఆరంభంలోనే ద్విపాత్రాభినయంలో నటించడం ఆనందంగా ఉంది. సినిమాలోని అఖిల పాత్రను చాలా మంది ఇష్టపడుతున్నారు. మరో పదేళ్ల పాటు నా క్యారెక్టర్‌ గుర్తుండిపోతుందని ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్‌ రోల్స్‌లో నటించాలనుంది. ప్రతి సినిమాకు నేను హోమ్‌వర్క్‌ చేస్తాను. పాత్రకు సంబంధించిన వివరాల్ని రాసి పెట్టుకొని ప్రిపేర్‌ అవుతాను. అలాంటప్పుడే అనుకున్న విధంగా అభినయించడం సాధ్యమవుతుంది' అని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. పది మంది మృతి... ఎక్కడ?

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments