Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగమార్తాండ టైటిల్ లోగోలో క‌థ చెప్పేసిన కృష్ణవంశీ

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (17:23 IST)
Rangamarthanda Title Logo
సినిమాకు టైటిల్ ఎంత ప్ర‌ధాన‌మో, లోగో కూడా అంతే ప్ర‌ధానం. టైటిల్‌లో క‌థేమిటో తెలియ‌క‌పోయినా లోగోలో దాని తాలూకు వివ‌రాల‌ను చెప్ప‌డం విశేషం. ఇప్పుడు ద‌ర్శ‌కుడు  కృష్ణవంశీ తాజా సినిమా రంగమార్తాండ. ఈ చిత్ర టైటిల్ లోగోను ప్రేక్ష‌కుల‌కు ఈరోజు ప‌రిచ‌యం చేశారు. మ‌న అమ్మానాన్న‌ల క‌థే రంగమార్తాండ అంటూ చెబుతూ, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ ఆర్ట్ పొటోలు పెట్టారు. 
 
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగమార్తాండ. 
 
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటించిన ఈ చిత్ర టైటిల్ లోగోను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. 
 
రంగమార్తాండ సినిమా టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథ గా రంగమార్తాండ థియేటర్స్ కు రానుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

Jagan: కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుదాం.. జగన్ పిలుపు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments