Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్‌'లో కృష్ణంరాజు కీలక పాత్ర... సంగీత దర్శకుడిగా కీరవాణి

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:06 IST)
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న చిత్రం "ఆదిపురుష్". భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతూనేవుంది. 
 
హీరోయిన్ల విషయంలో నిన్నమొన్నటి వరకు వార్తలలో నిలిచిన ఈ చిత్రం.. ఇప్పుడు ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడనే వార్తతో పాటు మరో సంచలన విషయంలో కూడా ట్రెండింగ్‌ అవుతోంది. పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు చేసే పాత్ర ఏమిటనేది బయటికి రాలేదు కానీ.. కీలక పాత్ర అంటూ వార్తలు స్టార్టయ్యాయి. పౌరాణిక పాత్రలు కృష్ణంరాజుకి కొత్తేమీ కాదు. కాకపోతే ఈ వార్తలో ఎంత నిజం ఉందనేదే తెలియాల్సి ఉంది.
 
అదేవిధంగా ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా టాప్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ని సెట్‌ చేయాలని ఓంరౌత్‌ చూస్తున్నాడట. ఆ మ్యూజిక్‌ డైరెక్టర్స్ లిస్ట్‌లో ఏఆర్‌ రెహమాన్‌తో పాటు 'బాహుబలి' మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌. కీరవాణి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫైనల్‌గా ఈ చిత్రానికి ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌ వర్క్ చేస్తారో తెలియదు కానీ.. కీరవాణి పేరు ఈ చిత్రానికి వినిపిస్తుండటంతో ఆయనే ఫైనల్‌ అవ్వాలని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా కోరుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.
 
అలాగే, ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేస్తున్నాడంటూ చిత్రయూనిట్‌ అఫీషియల్‌గా ప్రకటించింది. ఆ తర్వాత హీరోయిన్‌ విషయంలో ముగ్గురు హీరోయిన్ల పేరు వినిపించింది. ఇప్పుడు తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. అనుష్క శర్మ గురించి వార్తలు నడుస్తున్నాయో లేదో.. ఇప్పుడు మరో గాసిప్ సోషల్‌ మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments