Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ - మాస్ అనే తేడా లేకుండా "శ్రీ శ్రీ" చిత్రాన్ని చూస్తున్నారు : సూపర్ స్టార్ కృష్ణ

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించిన చిత్రం "శ్రీ శ్రీ".

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (16:40 IST)
సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కించిన చిత్రం "శ్రీ శ్రీ". ఈ చిత్రాన్ని ఎస్.బి.ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. 
 
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు సోమవారం జరిగిన 'శ్రీ శ్రీ' స‌క్సెస్ మీట్‌లో సూపర్ కృష్ణ మాట్లాడుతూ...‘‘ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా ఆడ‌ని దేశాల్లో కూడా శ్రీ శ్రీ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం, అక్క‌డ కూడా మంచి రెస్పాన్స్ రావ‌డం సంతోషంగా ఉంది. శ్రీ శ్రీ చిత్రానికి ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. సినిమాలో చాలా చోట్ల డైలాగ్స్‌కి క్లాప్స్ కొడుతున్నారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌య‌సుల వాళ్లు ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత‌లు యంగ్ స్ట‌ర్స్, ఈ చిత్రంతోనే నిర్మాణ రంగంలో ప్ర‌వేశించారు. ముప్ప‌ల‌నేని శివతో క‌లిసి మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను. మంచి కలెక్షన్స్‌తో శ్రీ శ్రీ సూప‌ర్ హిట్ రేంజ్‌కి వెళ్లాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ ముప్ప‌ల‌నేని శివ మాట్లాడుతూ...‘‘శ్రీ శ్రీ వంటి సినిమాను కృష్ణగారితో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆరు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత కృష్ణ గారు శ్రీ శ్రీ అనే మంచి సినిమాలో న‌టించారు అంటూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో కృష్ణ గారు అద్భుతంగా న‌టించారు. అన్ని కేంద్రాల్లో క‌లెక్ష‌న్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. విదేశాల్లో ఆన్‌లైన్ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం. అక్క‌డ కూడా మా చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంది. శ్రీ శ్రీ కృష్ణ గారి కెరీర్లో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
 
ఎంఫ్లిక్స్ అధినేత రాజు న‌డింప‌ల్లి మాట్లాడుతూ... ‘‘శ్రీ శ్రీ చిత్రాన్ని ఆన్ లైన్ లో కూడా రిలీజ్ చేసి కృష్ణ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. మొరాకో, యుగాండ ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా రిలీజ్ చేయ‌ని దేశాల్లో కూడా శ్రీ శ్రీ చిత్రాన్ని రిలీజ్ చేశాం. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత కృష్ణ గారి సినిమా చూసే అకాశం క‌ల్పించారంటూ అక్క‌డ ఉన్న అభిమానులు అభినంద‌న‌లు తెలియ‌చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. ఒక మంచి చిత్రాన్ని అందించినందుకు గ‌ర్వంగా ఉంది అన్నారు. 
 
ఈ చిత్ర నిర్మాత‌లు శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్  మాట్లాడుతూ ‘‘శ్రీ శ్రీ విడుదలైన అన్నీ చోట్ల మంచి రెస్పాన్స్ తో ముందుకు సాగుతుంది. ఇక్కడే కాకుండా ఓవర్ సీస్ లో మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. కృష్ణగారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

heart attack: సిక్సర్ కొట్టాడు, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments