Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోట శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్స్.. హీరోలు, హీరోయిన్ల గురించి..?

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (19:41 IST)
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ప్రవర్తన, మాట్లాడుతున్న మాటల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బృందావనం' సినిమా గురించి కొన్ని ఆసక్తికర ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

బృందావనం సినిమా కంటే ముందు ఎన్టీఆర్, తాను కలిసి పలు సినిమాల్లో చేసినా.. బృందావనం మాత్రం తనకు సంతృప్తిని ఇచ్చిన సినిమా అని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఇక బృందావనం సినిమాలో తాత వేశాన్ని తాను మాత్రమే చేయాలని దిల్ రాజు స్వయంగా వంశీ పైడిపల్లికి చెప్పినట్లు కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
 
ఎందుకంటే.. కోట ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ చాలా మాటలు మాట్లాడుతున్నారు. వస్త్రధారణ మారుతోంది కానీ జ్ఞానం మాత్రం రావడం లేదంటూ కోట నేటి హీరోయిన్ల పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే కోట గారి అసహనానికి కారణం.. వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆటుపోట్లే అని ఆయన గురించి తెలిసిన వాళ్లు ఆయన పై సానుభూతి చూపిస్తున్నారు. కానీ ప్రతి ఇంటర్వ్యూలో కోట యాంకర్ అడగకుండానే.. 'ఇప్పటి హీరోలకు సాధన లేదు గాని, వాదన ఎక్కువైంది అంటూ అలాగే 'హీరోలకు జ్ఞానం ఉండటం లేదు, వాళ్ళు విజ్ఞానం పెంచుకోవాలి' అంటూ మాట్లాడటం కొంతమంది ఆయా హీరోల సన్నిహితులను బాధిస్తోంది.
 
దర్శకుడు హరీష్ శంకర్ లాంటి వారు అయితే, డైరెక్ట్‌గా కోటకు ఫోన్ చేసి.. బాబాయ్ మీరు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు అంటూ సూచనలు చేస్తున్నారు. అయితే మరోపక్క కోట మాటలను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి హీరోల్లో చాలామంది సినియర్ నటీనటులకు అసలు గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని.. అందుకే కోట గారు అలా మాట్లాడారు అని కొంతమంది కోట పాయింట్ ఆఫ్ వ్యూకి మద్దతు పలుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments