Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత్ శాటిలైట్ రైట్స్ అదుర్స్.. గడ్డంతో మహేష్ బాబు లుక్ లీక్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ''భరత్ అనే నేను'' సినిమా మంచి బిజినెస్‌ రాబట్టింది. మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సి

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (14:28 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ''భరత్ అనే నేను'' సినిమా మంచి బిజినెస్‌ రాబట్టింది. మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఓవర్సీస్‌ల్లో అదిరే వసూళ్లను కొల్లగొట్టింది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ ద్వారా రికార్డు సృష్టించింది. భారీ మొత్తంలో శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న రెండో తెలుగు సినిమాగా భరత్ అనే నేను నిలిచింది. 
 
ఈ ఏడాది (2018)లో అత్యధిక మొత్తాన్ని శాటిలైట్ రైట్స్‌గా సంపాదించుకున్న సినిమాగా భరత్ అనే నేను నిలిచింది. కాగా భరత్ అనే నేను శాటిలైట్ రైట్స్ రూ.22 కోట్లకు పలికింది. దీంతో భరత్ అనే నేను నాన్ బాహుబలి (శాటిలైట్ రైట్స్ రూ.51కోట్లు) రికార్డులన్నింటికీ బద్దలు కొట్టినట్లయింది. 
 
ఇకపోతే.. భరత్ అనే నేను సినిమాకు తర్వాత మహేష్ చేస్తున్న కొత్త సినిమా కోసం ఫిజిక్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. మహేష్ కొత్త లుక్ ప్రస్తుతం లీక్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ గడ్డంతో ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలొచ్చాయి. 
 
ఈ వార్తలను నిజం చేసే దిశగా.. మహేష్ బాబు లుక్‌తో కూడిన తాజా వీడియోను 'మహేష్ బాబు ఫ్యాన్స్ క్లబ్' తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా.. అది కాస్త వైరల్ అవుతోంది. మామూలుగానే అందంగా కనిపించే మహేష్, ఈ తాజా లుక్‌లో గడ్డంతో క్యూట్‌గా కనిపిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments