Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండమురళిని కాల్చిన రోజే ట్రైల‌ర్ - రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (12:01 IST)
Konda murali- varama
రామ్‌గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల సినిమా టిక్కెట్ల‌పై ఎ.పి. ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు సంధించ‌డం, పేర్ని నానిని క‌ల‌వ‌డం వంటి ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిందే. త‌న రూపొందించిన `కొండా` సినిమా విడుద‌ల చేయ‌డానికి అడ్డంకిగా వుంద‌ని ఆయ‌న భావించిన‌ట్లున్నారు. అన్నీ క‌లిసివ‌స్తే జ‌న‌వ‌రి 26న సినిమా విడుద‌ల చేసేవారు. కానీ ప‌రిస్థితులు కోవిడ్ వ‌ల్ల రివ‌ర్స్ అయ్యాయి. అందుకే ట్రైల‌ర్‌ను ఆరోజున విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కొండా సినిమా గురించి స్టోరీని మంగ‌ళ‌వారంనాడు పోస్ట్ చేశాడు.
 
 కొండ ట్రైలర్ జనవరి 26,  గణతంత్ర దినోత్సవం ప‌గ‌లు 10.25 గంట‌ల‌కు  విడుదల కానుంది. 30 ఏళ్ల క్రితం కొండమురళిని చంపేందుకు అదే రోజున కాల్పులు జ‌రిగాయి. కానీ 3 బుల్లెట్లతో బ్రతికివున్నారంటూ.. ఆ క‌థ వినండి అంటూ ఇలా తెలియ‌జేస్తున్నాడు. 
 
కనీ వినీ యెరుగని  అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి.
 
కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం.
 
ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికొస్తే  కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పుడుతారు. కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని నాయకుడై ఒకే అమ్మకి, నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగే వాడే నల్ల సుధాకర్.
ఇకపోతే ఆర్కే, భారతక్క : తెలంగాణలో ఒక్క సామెత ఉంది.
 
'పొట్టోన్ని పొడుగోడు కొడ్తే, పొడుగోన్ని పోశమ్మ కొట్టిందంటరు'
 
ప్రజలను కాలరాస్తు బలిసిపోయిన  నాయకులను, వాళ్ళకు అమ్ముడు పోయిన కొందరూ పోలీస్ లను, పోచమ్మలా నరికేదందుకు పుట్టినోళ్ళే ఆర్కే, భారతక్క..
 
కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవమనేది తుపాకీ తూటల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు  గుండెల్లోతుల్లోని బాధల నుంచి పుడుతుంది. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి  ఉన్నంత వరకు, విప్లవం అనే ఒక దైవసర్పం కాటేస్తూనే  ఉంటుంది.
 
పెత్తందారులకి ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కథలు  బెజవాడ దుర్గమ్మ, అనంతపురం సుంకాలమ్మని  మించిన మైసమ్మ శాల్తులుగా నాకు అనిపించ బట్టే మీకు కనిపించ చెయ్యబోతున్నాను.
ఈ నిజాలన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయి . కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26th, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతుంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, యెన్నో  సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26th, రిపబ్లిక్ డే రోజున అదే 10గంటల 25 నిముషాలకి  కొండా మురళి పైన వంచనగిరిలో, ఒక్క అత్యంత దారుణ హత్య ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయ వల్ల కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబందించిన  కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి.
ఆ బుల్లెట్ లకి ముందు కథ, వాటి తర్వాత కథే, మా కొండా కథ..
 లాల్ సలాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments