Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోన వెంక‌ట్ ఫిల్మ్ 'డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు'

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:09 IST)
Siddu jonnalagadda, Dallaslo desi dongalu
హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న‌టించ‌నున్న లేటెస్ట్ ఫిల్మ్ 'డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు'. క్రైమ్ కామెడీగా రూపొందే ఈ చిత్రానికి సాయికిర‌ణ్ దైద‌ ద‌ర్శ‌కుడు. కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, క‌ళాహి మీడియా బ్యాన‌ర్ల‌పై కోన వెంక‌ట్‌, య‌శ్వంత్ ద‌గ్గుమాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఆదివారం సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా 'డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు' టైటిల్ మూవీని అనౌన్స్ చేయ‌డంతో పాటు, టైటిల్ లోగో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 
 
వైవిధ్యంగా డిజైన్ చేసిన ఈ టైటిల్ పోస్ట‌ర్‌లో అత్యంత ఎత్త‌యిన ఓ బిల్డింగ్ టెర్రెస్‌పై నిల్చొని ఉన్న సిద్ధు.. చేతిలో గ‌న్‌, ముఖానికి మాస్క్‌తో క‌నిపిస్తున్నారు. టైటిల్ డిజైన్‌తోటే సినిమాపై ఆస‌క్తి రేకెత్త‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. 'డ‌ల్లాస్‌లో దేశి దొంగ‌లు' ఆ ఇంపాక్ట్‌ను క‌లిగిస్తోంది.

ఈ మూవీని "DDD" అని కూడా పిలుస్తున్నారు. ల‌వ్ స్టోరీ మేళ‌వించిన బ్యాంక్ రాబ‌రీ స్టోరీతో రూపొందే ఈ సినిమా షూటింగ్‌ను మే నెల‌లో ప్రారంభించ‌నున్నారు. పూర్తిగా అమెరికాలోని డ‌ల్లాస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ గ‌ట్టు సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments