తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. జాతీయ రహదారి సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. నరసింహనంది దర్శకత్వంలో వచ్చిన '1940లో ఒక గ్రామం', 'కమలతో నా ప్రయాణం', 'లజ్జ' సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జాతీయ రహదారి' సినిమా ఫీల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది.
ఈ చిత్రంలో మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత అంబికా కృష్ణ జాతీయ రహదారి చిత్ర దర్శకుడు, నిర్మాతలకు అభినందనలకు తెలిపారు. 'రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తి చేసుకొని, 101వ సినిమా 'జాతీయ రహదారి'తో ముందుకు వస్తుండటం అభినందించాల్సిన విషయమన్నారు. తెలుగు చిత్రసీమలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. తమిళంలో సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా, మలయాళంలో తీసిన 'జల్లికట్టు' సినిమాలు ఆస్కార్ నామినేషన్‌కి వెళ్లాయి. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు, ఇండస్ట్రీ పెద్దలు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని' అన్నారు.