స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

ఠాగూర్
ఆదివారం, 6 అక్టోబరు 2024 (14:57 IST)
స్వరాష్ట్రమైన కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన జోకర్.. ఇపుడు గెలుపు వీరులు కూర్చొనే వేదికపై కూర్చొని నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తమిళ నిర్మాత వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి సమానత్వం గురించి మాట్లాడుతుంటే మరో రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి 'స' కారం గురించి మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనికి తమిళ నిర్మాత వినోద్ కుమార్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 
 
తాజాగా ప్రకాష్ రాజ్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో ఓ వేదికపై కూర్చున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫొటోలో సీఎం స్టాలిన్‌, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివలు కూడా ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి విత్ డిప్యూటీ సీఎం అని పెట్టారు. అయితే ఈ ఫోటోకి ప్రకాష్ రాజ్‌కి ఊహించని ట్వీట్ ఎదురైంది. 
 
'ఎనిమి', 'మార్క్ ఆంటోని' సినిమాలు నిర్మించిన నిర్మాత వినోద్ కుమార్ ప్రకాష్ రాజ్ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ.. వాళ్లంతా ఎన్నికల్లో గెలిచారు. నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయావు. నీకు వాళ్లకు అదే తేడా. పైగా, నీ వల్ల నాకు షూటింగ్ క్యాన్సిల్ అయి కోటి రూపాయల నష్టం వాటిల్లింది. చెప్పకుండా కారవాన్ నుంచి పారిపోయావు. కాల్ చేస్తానని చెప్పావు. ఇప్పటివరకు చేయలేదు అంటూనే జస్ట్ ఆస్కింగ్ పేరుతో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మరో ట్వీట్‌లో ఒక జోకర్ తన స్వరాష్ట్రంలో పోటీ చేసిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు అంటూ విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments