Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అంజి" చిత్రం పూర్తికావడానికి చిరంజీవి గొప్పతనమే కారణం: కోడి రామకృష్ణ

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "అంజి". ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసేందుకు ఐదేళ్ళ సమయం పట్ట

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (14:37 IST)
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "అంజి". ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసేందుకు ఐదేళ్ళ సమయం పట్టింది. అమ్మోరు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ తర్వాతి చిత్రాన్ని చిరంజీవితో తీయాలని కోడి రామకృష్ణ నిర్ణయించారు. ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పడంతో ఆయన సమ్మతించారు. 
 
దీనిపై ఇపుడు కోడి రామకృష్ణ మాట్లాడుతూ, గ్రాఫిక్స్‌తో కూడిన సినిమా అంటే ఓ కొత్త ఆర్టిస్టులా మీరు కష్టపడవలసి ఉంటుందని అన్నాను. 'కొత్త ఆర్టిస్టుల ఎంత కష్టమైనా పడటానికి నేను సిద్ధం .. గ్రాఫిక్స్‌కి సంబంధించిన సినిమానే చేయండి' అన్నారాయన. ఈ సినిమాలో ఇంటర్వెల్‌లో వచ్చే సీన్‍ను నెల రోజుల పాటు చిత్రీకరించాం. ఎంతో ఓపికగా చిరంజీవిగారు చేశారు. అలా చాలా డబ్బు ఖర్చుపెడుతూ ఈ సినిమా చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 
 
ముఖ్యంగా, క్లైమాక్స్ సీన్ కోసం ఒక డ్రెస్‍ను చిరంజీవిగారు రెండు సంవత్సరాలు వేసుకున్నారు. గ్రాఫిక్స్‍కి సంబంధించిన సమస్యలు వస్తాయని ఆయన అలాగే ఆ డ్రెస్‍తో చేసేవారు. ముందుగా చెప్పినట్టు ఒక కొత్త ఆర్టిస్టు మాదిరిగానే కష్టపడ్డారు. ఇంతటి భారీ సినిమాను కొత్త హీరోయిన్‍తో చేయడానికి చిరంజీవి అంగీకరించడం మరో విశేషం. ఆ సినిమా పూర్తికావడానికి ఆయన గొప్పతనమే కారణమని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments