Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 28న విడుదలవుతున్న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:55 IST)
Kirti Suresh
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో  తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది.
 
తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. రిపబ్లిక్ డే అయిన రెండు రోజులకు అంటే జనవరి 28న  గుడ్ లక్ సఖి సినిమా విడుదల కానుంది. ఇక గుడ్ లక్ సఖి సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మేకర్ల మరింతగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఇక సినిమా విడుదలకు వారం రోజులే ఉండటంతో ప్రమోషన్స్‌ ను వేగవంతం చేయనున్నారు.
 
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు.
ప్ర‌ముఖ నిర్మాత  దిల్‌రాజు  సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, చిరంతాన్ దాస్ సినిమాటోగ్రర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.
ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి.
 
తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు తదిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రావ్య వర్మ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US Elections 2024: కొనసాగుతున్న పోలింగ్.. కమలా హారిస్, ట్రంప్ ఏమన్నారంటే...

హైదరాబాద్‌లో ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024

సమాజ సేవ ద్వారా ఐక్యతను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్

పవన్ కల్యాణ్ చిన్నపిల్లాడి లెక్క మాట్లాడితే ఎలా?: మందక్రిష్ణ మాదిగ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్- రాహుల్ గాంధీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments