Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబర్ 26న కీర్తి సురేష్- గుడ్‌ల‌క్ స‌ఖి

నవంబర్ 26న  కీర్తి సురేష్- గుడ్‌ల‌క్ స‌ఖి
, సోమవారం, 1 నవంబరు 2021 (18:38 IST)
keerthi suresh, Adi Pinchetti, Jagapathi Babu
జాతీయ అవార్డు న‌టి కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `గుడ్ లక్ సఖి` ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యుల బృందంతో ఈ చిత్రం రూపొందుతోంది.
 
కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సినిమాను నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల  తేదీని ప్రకటించారు.  ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో కీర్తి సురేష్ తన టార్గెట్‌కు గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఆ పోస్టర్‌లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా కనిపిస్తున్నారు.
 
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని ప్ర‌ముఖ నిర్మాత  దిల్‌రాజు  సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండ‌గా చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.
 
ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, ఇతర ప్రమోషనల్ వీడియోలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాపీగా నవ్వుకునేలా అనుభవించు రాజా- ఉంటుంది - సుప్రియ యార్ల‌గ‌డ్డ‌