Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కిర్రాక్ పార్టీ' కలెక్షన్లు ఎంతో తెలుసా? ఫిల్మ్ ట్రేడ్ వర్గాల విస్మయం

యువహీరో నిఖిల్ - శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో గత శుక్రవారం రిలీజ్ అయిన చిత్రం "కిర్రాక్ పార్టీ". సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డేలు హీరోయిన్లు. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (14:52 IST)
యువహీరో నిఖిల్ - శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో గత శుక్రవారం రిలీజ్ అయిన చిత్రం "కిర్రాక్ పార్టీ". సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డేలు హీరోయిన్లు. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఫలితంగా తొలిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.50 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
 
ఆ తర్వాత మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.15 కోట్లకి పైగా గ్రాస్‌ను వసూలు చేసిందట. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమా, మొదటి మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లను సాధించడం సినీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. 
 
ఈ సినిమా లాభాల బాట పట్టడానికి ఎన్నో రోజులు పట్టదనే విషయం స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. ప్రేక్షకుల ఆదరణ వల్లనే ఈ స్థాయి సక్సెస్ సాధ్యమైందంటూ.. ఆదివారం రాత్రి ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చిన నిఖిల్, ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. 
 
కాగా, ఈ చిత్రం గతంలో వచ్చిన హ్యాపీడేస్ తరహాలో యూత్‌ను బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా ఈ చిత్రానికి యూత్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కారణంగా అన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కిర్రాక్ పార్టీ చిత్రం ప్రదర్శితమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments