Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిఖిల్ 'కిర్రాక్ పార్టీ' రివ్యూ... 'హ్యాపీడేస్‌' కంటే తక్కువే...

'హ్యాపీడేస్‌'లో ఓ కాలేజీ కుర్రాడిగా అల్లరిచేసి ఎంటర్‌టైన్‌ చేసిన నిఖిల్‌ తాజా చిత్రం 'కిరాక్‌ పార్టి'. ఇందులో తనే లీడ్‌రోల్‌ చేశాడు. కన్నడ సినిమా 'కిర్రాక్‌ పార్టి'కి రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రం శు

నిఖిల్ 'కిర్రాక్ పార్టీ' రివ్యూ... 'హ్యాపీడేస్‌' కంటే తక్కువే...
, శుక్రవారం, 16 మార్చి 2018 (17:29 IST)
నటీనటులు: నిఖిల్‌, సిమ్రన్‌ పరీన్జ, సంయుక్త హెగ్డే, కార్తీక్‌ తదితరులు
 
సాంకేతికత: 
సంగీతం : అంజనీష్‌ లోకనాథ్‌, సినిమాటోగ్రఫర్‌ : అద్వైత గురుమూర్తి, ఎడిటర్‌ : ఎం.ఆర్‌.వర్మ, స్క్రీన్‌ ప్లే : సుధీర్‌ వర్మదర్శకత్వం : శరన్‌ కొప్పిశెట్టి, నిర్మాత : సుంకర రామబ్రహ్మం.
 
'హ్యాపీడేస్‌'లో ఓ కాలేజీ కుర్రాడిగా అల్లరిచేసి ఎంటర్‌టైన్‌ చేసిన నిఖిల్‌ తాజా చిత్రం 'కిరాక్‌ పార్టి'. ఇందులో తనే లీడ్‌రోల్‌ చేశాడు. కన్నడ సినిమా 'కిర్రాక్‌ పార్టి'కి రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రం శుక్రవారం తెలుగులో విడుదలైంది. నూతన దర్శకుడు శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
 
కథ :
ఇంజనీరింగ్‌ విద్యార్థి కష్ణ (నిఖిల్‌) మొదటి సంవత్సరంలోనే నాలుగో సంవత్సరం చదువుతున్న మీర (సిమ్రాన్‌ పరీన్జ)ను ప్రేమిస్తాడు. కృష్ణ చేసిన మంచి పనులే ఆమెను ప్రేమించేలా చేస్తుంది. అయితే అనుకోని ప్రమాదంతో మీర మృతి చెందుతుంది. ఆ షాక్‌తో ఎప్పుడూ సరదాగా ఉండే కష్ణ కఠినంగా మారిపోతాడు. ఆ మార్పు నాలుగేళ్ళకు కాలేజీ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదుగుతాడు. ఆ యేడాది జూనియర్‌ అయిన సత్య (సంయుక్త హెగ్డే) కృష్ణను ప్రేమిస్తుంది. కానీ కష్ణమీర జ్ఞాపకాల్లోనే ఉండిపోతాడు. అతని గతం గురించి తెలుసుకున్న సత్య అతన్ని ఎలా మార్చింది? అనేది కథ.
 
ప్లస్‌ పాయింట్స్‌:
హీరో నిఖిల్‌... కష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. మొదటి సంవత్సరం చదివే కుర్రాడిగా సరదాగా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తూనే సీనియర్‌గా సీరియస్‌నెస్‌తోనూ మెప్పించాడు. అతని స్నేహితులుగా నటించిన ఐదుగురూ పర్వాలేదనిపించేలా చేశారు. మీర పాత్ర ఓకే. సత్య పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా కన్నడలో చేసిన సంయుక్త హెగ్డేనే నటించి మెప్పించింది. సినిమా మొదటి భాగమంతా స్నేహితుల మధ్య, కాలేజీలో జరిగే సరదాగా సన్నివేశాలతో, చిన్నపాటి లవ్‌ ట్రాక్‌తో నడుస్తూ సాగుతుంది. 
 
సంగీత దర్శకుడు అంజనీష్‌ లోకనాథ్‌ అందించిన పాటల సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ రెండూ ఇంప్రెస్‌ చేశాయి. 'ధమ్‌ దరే ధమ్‌.... ఒన్‌పై ఫోర్‌.. అంటూ..' స్నేహితుల మధ్యన నడిచే పాట, హీరో హీరోయిన్ల నడుమ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ ఆకట్టుకున్నాయి. హీరో స్నేహితుల పాత్రలో నటించిన యువకులు కూడ ఎక్కడా లిమిట్స్‌ దాటకుండా సెటిల్డ్‌గా పెర్ఫార్మ్స్‌ చేసి సినిమాకు రియలిస్టిక్‌ లుక్‌ వచ్చేలా దోహదపడ్డారు. ప్రీ ఇంటర్వెల్‌, ఇంటర్వెల్‌ సన్నివేశాలు ఎమోషనల్‌‍గా ఉండి ఆకట్టుకున్నాయి.
 
'తొలిసారి జారింది గుండె ఇక్కడే.. గొడవల్లో గెలిచి.. ఓడించి ఇక్కడే.. అందంగా జీవితాన్ని పాఠంగా నేర్పించి ఇక్కడేగా.... కలిసింది.. ఇక్కడే.. విడిపోతుంది.. ఇక్కడేగా.. నేస్తమా..' అంటూ ముగింపు సన్నివేశం, సంభాషణలు హృదయాన్ని టచ్‌ చేస్తుంది. ఇది మినహా చిత్రమంతా రొటీనే.
 
మైనస్‌ పాయింట్స్‌ :
ఈ సినిమాను చూస్తున్నంతసేపూ 'హ్యాపీడేస్‌'ను పోల్చుకోవడం ప్రధాన లోపంగా చెప్పొచ్చు. అందులో వున్న కుర్రాళ్ళకు ఒక్కో లవ్‌ ట్రాక్‌ వుంటూ.. జీవితంలో ఎలా ఎదగాలనేది ముగింపులో కాలేజీ ప్రిన్సిపాల్‌ బోధిస్తాడు. అందుకే ఆ చిత్రం ఎక్కడా బోర్‌ అనిపించదు. కానీ ఈ సినిమా కాస్త విరుద్ధంగా ఉంటుంది. కొన్నిచోట్ల బోర్‌ కొట్టించే సన్నివేశాలూవున్నాయి. దాన్ని ఆ తర్వాత సెంటిమెంట్‌తో కట్టడి చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మీర చనిపోవడం యాదృచ్ఛికమైనా.. దాని వెనుక ఏదో వుందనే భ్రమించజేయడం.. మీర తల్లిదండ్రుల దగ్గరకు కృష్ణను సత్య తీసుకెళ్ళేలా చేయడమనే సన్నివేశాలు పొంతనలేకుండా వుంటాయి. అక్కడక్కడా బిట్‌బిట్‌లుగా అనిపిస్తాయి. కాలేజీ ఎన్నికలు, గొడవలు చూపించినా అవేమీ కొత్తగా అనిపించవు. దాంతో కథానాయకుడి పాత్ర యొక్క గమ్యం, వ్యక్తిత్వం ఏమిటనేది క్లారిటీగా తెరపై కనబడదు.
 
సాంకేతిక విభాగం :
కథనాన్ని అందించిన సుధీర్‌ వర్మ మొదటి అర్థభాగాన్ని బాగానే రాసినా ద్వితీయార్థాన్ని మాత్రం పేలవంగా రాయడంతో దర్శకుడు శరన్‌ కొప్పిశెట్టి పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో సినిమా రెండో సగం ఫన్‌, ఎమోషన్‌ ఏదీ పూర్తిస్థాయిలో పండలేదు. చందూ మొండేటి రాసిన డైలాగ్స్‌ బాగానే పర్వాలేదనిపించాయి. నిర్మాణ సంస్థ ఏకే ఎంటెర్టైమెంట్స్‌ ఎప్పటిలాగే మంచి నిర్మాణ విలువల్ని పాటించి తమ స్థాయిని చాటుకుంది. ఎం.ఆర్‌.వర్మ ఎడిటింగ్‌ ద్వారా రెండో అర్థభాగంలో కొన్ని అనవసరమైన సన్నివేశాలని తొలగించాల్సింది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌ ఫీల్‌ను అందించగా అంజనీష్‌ లోకనాథ్‌ సంగీతం మెప్పించింది.
 
విశ్లేషణ:
'హ్యాపీడేస్‌' సినిమా వచ్చాక దాన్ని బేస్‌చేసుకుని కన్నడలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ కోవలోనిదే కిర్రాక్ పార్టీ. ఇది అక్కడ బాగానే ఆడింది. నిర్మాత మాటల్లోనే చెప్పాలంటే... హ్యాపీడేస్‌ + శివ.. సినిమాలు కలిపితేనే కిర్రాక్‌ పార్టీ. అంటే ఆ రెండు కూడా తెలుగు చిత్రాలే. వాటిని అటూఇటూ మార్చి తీసిన కన్నడ సినిమాను పోటీపడి రైట్‌ దక్కించుకుని రీమేక్‌ చేయడం చిత్రమనే చెప్పాలి. అందుకే ఆ రెండు చిత్రాలకంటే ఇది తక్కువనే చెప్పాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వా.. నేనా తేల్చుకుందామంటున్న బాబాయ్ - అబ్బాయ్