Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

దేవీ
శుక్రవారం, 4 జులై 2025 (18:21 IST)
Kiriti Reddy, Srileela
గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి తొలి మూవీ 'జూనియర్'. రాధా కృష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జూలై 18న విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్లలో డోస్ పెంచారు.
 
ఒక పాట బిగ్ హిట్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించినప్పుడు, అది వైరల్ పాట అనే లేబుల్‌ను సంపాదిస్తుంది. కానీ జూనియర్ విషయంలో మాత్రం... ఇక్కడ వైరల్ అవుతోందది పాట మాత్రమే కాదు హీరోయిన్ శ్రీలీ. సెకండ్ సాంగ్‌ వైరల్ వయ్యారికి  కొత్త ఇమేజ్‌ ఇచ్చింది శ్రీలీల.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మాస్ ఎనర్జీతో నిండిన కంపోజిషన్ ఇచ్చారు. సాంగ్ అదిరిపోయింది. DSP, హరిప్రియ ఇద్దరూ పాడిన స్టైల్ సాంగ్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్లింది. లిరిక్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి కూడా సూపర్ మోడర్న్ టచ్ ఇచ్చారు. యూత్‌తో కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా లాంగ్వేజ్, ట్రెండీ ఫ్రేసెస్ తో  హైలైట్ అయింది.
 
కిరీటి రెడ్డి, శ్రీలీల కలిసి డాన్స్ అదరగొట్టారు. కిరీటి స్టెప్పుల్లో గ్రేస్ చూపిస్తే, శ్రీలీల త‌న అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌, ఎలిగెన్స్‌తో ఆకట్టుకుంది. అందమైన సెట్స్‌లో షూట్ చేసిన వైరల్ వయ్యారి పాట క్యాచి మ్యూజిక్, ట్రెండీ లిరిక్స్, కలర్ ఫుల్ విజువల్స్ తో ఈ సాంగ్ ఈ ఏడాది వైరల్ చార్ట్‌బస్టర్ హిట్ కానుంది.  
 
ఈ సినిమాకి కె.కె. సెంథిల్ కుమార్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్, పీటర్ హెయిన్  యాక్షన్ కొరియోగ్రఫీ, నిరంజన్ దేవరమనే ఎడిటర్. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని డైలాగ్ అందిస్తున్నారు.
 తారాగణం: కిరీటి, శ్రీలీల, జెనీలియా, డాక్టర్ రవిచంద్ర వి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments