Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ టీజర్‌ విడుద‌ల‌

Webdunia
గురువారం, 14 జులై 2022 (16:41 IST)
Kiran Abbavaram
హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీర ప‌ర్ధేశీ జంట‌గా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ.  ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురిళి కిషోర్ గ‌తంలో పని చేశారు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జులై 15న హీరో కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా  'వినరో భాగ్యము విష్ణుకథ' టీజర్ విడుదల చేసారు మేకర్స్. ఇప్పటికే గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్ అందరినీ అలరించింది. తాజాగా వచ్చిన టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంది.
 
నా పేరు విష్ణు.. మా ఊరు తిరుపతి..
మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేదే నా కథ.. ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా.. అని కిరణ్ చెప్తుండగానే.. హ్యాపీ బర్త్ డే విష్ణు అంటూ టీజర్ ముగుస్తుంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందలో కిరణ్ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. పిల్లా నువ్వు లేని జీవితం,‌ భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, చావు క‌బురు చ‌ల్ల‌గా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి అద్భుతమైన విజయాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు. సెప్టెంబర్ 30న విడుదల కానుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.
స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్
నిర్మాత - బ‌న్నీవాసు
స‌హనిర్మాత - బాబు
ద‌ర్శ‌క‌త్వం - ముర‌ళి కిషోర్ అబ్బురూ
ఎడిట‌ర్ - మార్తండా కే వెంక‌టేశ్
మ్యూజిక్ - చైత‌న్ భ‌ర‌ద్వాజ్
‌సినిమాటోగ్ర‌ఫి - విశ్వాస్ డేనియ‌ల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ - స‌త్య గమిడి, శ‌ర‌త్ చంద్ర నాయుడు
ఆర్ డైరెక్ట‌ర్ - రామ్ కుమార్
ప్రొడక్ష‌న్ రిప్రెజంటేటివ్ - ప్ర‌సాద్ చ‌వ‌న్
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments