Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ బామ్మ పెట్టిన షరతుకు ఖంగుతిన్న నిర్మాత

Keerty Suresh
Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (18:23 IST)
టాలీవుడ్‌లో ఎక్స్‌పోజింగ్‌కు సై అంటున్న హీరోయిన్లకే వరుస ఆఫర్లు వస్తున్నాయి. మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించిన కీర్తి సురేష్ ఇందుకు మినహాయింపేమీ కాదు. ఆ చిత్రం హిట్ కావడంలో సినీ ఛాన్సులకు ఢోకా లేదని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పటికీ టాలీవుడ్‌లో మాత్రం అవకాశాలు దక్కడం లేదు. 
 
కీర్తి కమర్షియల్ మూవీస్‌తో పోలిస్తే పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకోవడం కూడా ఒక కారణమంటున్నారు కొందరు. ఇటీవల తను నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తిని ఒక నిర్మాత సంప్రదించారట. రెమ్యునరేషన్, ఎక్స్‌పోజింగ్ వంటి విషయాలన్నీ కూడా ఓకే అయ్యాయంట.
 
ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో కీర్తి నటించడానికి ఆమె అమ్మమ్మ నిర్మాతకు ఒక కండీషన్ పెట్టిందట. అదేమిటో ఆ సినిమాలో తనను కూడా నటింపజేయడమే. ఇదేం కండీషన్, తను ఇలాంటిదెప్పుడూ వినలేదని ఖంగు తిన్నారట సదరు ప్రొడ్యూసర్, ఈ విషయం ఆ నోటా ఈ నోటా మొత్తం పాకిపోయింది. 
 
కీర్తి తల్లి మేనక, ఆమె తల్లి సరోజ. ఆమెకు సినిమాలతో ఎలాంటి సంబంధం లేదు. అప్పుడప్పుడూ కీర్తితో పాటు షూటింగ్‌లకు వస్తుంటుంది. అలా రెమో షూటింగ్‌కి వచ్చినప్పుడు శివ కార్తికేయన్ చిన్న పాత్రలో ఆమెను నటింపజేసాడు. ఆల్రెడీ యాక్టింగ్‌పై ఆసక్తి ఉన్న బామ్మ ఇక అప్పటి నుండి నటించాలని డిసైడ్ చేసుకుందట. అడపాదడపా ఆఫర్లు కూడా వస్తున్నాయంట. ఆఫర్లు వస్తే ఓకే గానీ ఇలా కండీషన్లు పెట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments