Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ఇంకా టైమ్ వుంది.. మానవత్వం ఉన్న వ్యక్తినే పెళ్లాడుతా: కీర్తి సురేష్

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (17:01 IST)
మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిన కీర్తి సురేష్ వరుస ఛాన్స్‌లను కొట్టేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మడు 'రంగ్ దే' సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మూవీ సక్సెస్ ప్రమోషన్స్‌ను కొనసాగిస్తోంది చిత్ర బృందం. ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన వ్యక్తిగత అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై స్పందించిన ఆమె.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 
తనకే తెలియకుండా సోషల్ మీడియాలో పలుసార్లు పెళ్లి చేశారని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే తనకు ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఓ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకునే సమయం ఇంకా రాలేదని.. ఆ సమయం వస్తే మానవత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తిని పెళ్లాడుతానని క్లారిటీ ఇచ్చింది.
 
ఇకపోతే.. నితిన్‌ కథానాయకుడిగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రంగ్‌దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఇందులో నితిన్‌ సతీమణిగా కీర్తి నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు, కీర్తిసురేశ్‌ 'సర్కారువారి పాట' కోసం మహేశ్‌తో ఆడిపాడనున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments