Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘తిమ్మరుసు’గా సత్యదేవ్

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (16:23 IST)
Timmarusu
‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య’ వంటి చిత్రాల్లో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం 'తిమ్మరుసు'. 'అసైన్‌మెంట్‌ వాలి'  ట్యాగ్‌లైన్. ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌.  ఈ చిత్రాన్ని మే 21న విడుద‌ల చేస్తున్నారు.
ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. సత్యదేవ్‌ పవర్ఫుల్ లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments