Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే సావిత్రిగా మళ్లీ వద్దనుకున్నా.. ఇకపై బయోపిక్‌లొద్దు- కీర్తి సురేష్

దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో పేరు కొట్టేసిన కీర్తి సురేష్.. మహానటి సినిమా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (17:23 IST)
దక్షిణాది అగ్ర హీరోయిన్ల జాబితాలో పేరు కొట్టేసిన కీర్తి సురేష్.. మహానటి సినిమా స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కానీ అలాంటి పాత్రే మళ్లీ కీర్తి సురేష్‌ను వరించింది. కానీ ఆ ఛాన్స్‌కు కీర్తి నో చెప్పింది. దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించాల్సిందిగా కీర్తి సురేష్‌కి ఆఫర్ వచ్చింది. అయితే ఈ ఆఫర్‌ని కీర్తి సురేష్ అంగీకరించలేదు. ఈ ఛాన్స్ వద్దనుకున్న కారణాన్ని కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మహానటి అనేది ఒక మ్యాజిక్ లాంటిది. మళ్లీ తాను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో లేదో కూడా తెలియదు.. అందుకే ఆ ఛాన్స్ వద్దనుకున్నానని తెలిపింది. 
 
సావిత్రి మాత్రమే కాదు.. ఇకపై బయోపిక్ సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానంటూ చెప్పుకొచ్చింది. కీర్తి సావిత్రిగా వద్దనుకున్న పాత్రలో నిత్యామీనన్ కనిపించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య హత్య కోసం కుక్కపై ట్రయల్... భర్త కిరాతక చర్య!!

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

నేపాల్‌లో కుర్చీ మడత పెట్టి పాటకు అమ్మాయిల డాన్స్ స్టెప్పులు (video)

భార్యను నగ్నంగా వీడియో తీసి స్నేహితుడికి పంపాడు.. ఆ తర్వాత మత్తుమందిచ్చి...

మరింత వేగంగా రాజధాని అమరావతి నిర్మాణ పనులు... ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments