Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘు తాత లో హిందీ కష్టాలు చెప్పిన కీర్తి సురేష్

డీవీ
సోమవారం, 9 సెప్టెంబరు 2024 (17:39 IST)
Raghu tata-keerti
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రఘు తాత. హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ తరుణంలో
 
కీర్తి సురేశ్‌ మాట్లాడుతూ.. ‘నమ్మిన దాని కోసం నిలబడే ఓ ధైర్యశాలి పాత్రను రఘు తాత చిత్రంలో పోషించడం ఆనందంగా ఉంది.  ఆ పాత్రకు జీవం పోయడం ఓ సవాలుగా అనిపించింది. ZEE5లో ఈ ఆకర్షణీయమైన కథనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ అవుతుండటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
 
హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ZEE5తో భాగస్వామి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. విజువల్ ట్రీట్, ఎమోషనల్ జర్నీగా సాగే రఘు తాత చిత్రం ఈ ZEE5 ద్వారా అందరి వద్దకు చేరుతోంది. 'రఘుతాత' అనేది మాకు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్. ఇది సున్నితత్వం, హాస్యంతో ఉండటమే కాదు సామాజిక సమస్యలను తెలియజేస్తుంది’ అని అన్నారు.
 
దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ సినిమా మా జీవితంలో ఓ మరుపురాని ప్రయాణంగా నిలుస్తుంది. ఈ చిత్రం భాషా, ప్రాంతం అన్న తేడా లేకుండా అందరినీ అలరించగలిగింది. ఇక ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments