Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్న సూపర్ హీరో చిత్రంలో సుధీర్ బాబు ఫస్ట్ లుక్

Advertiesment
Sudheer babu look

డీవీ

, సోమవారం, 9 సెప్టెంబరు 2024 (15:38 IST)
Sudheer babu look
సుధీర్ బాబు ఎమోషనల్ రోలర్‌కోస్టర్ రైడ్‌ 'మా నాన్న సూపర్‌హీరో'తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించారు.
 
మెస్మరైజింగ్  ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సుధీర్ బాబు మధ్యతరగతి కుర్రాడి అవతార్‌లో స్కూటర్‌ను నడుపుతూ, స్కూల్ పిల్లలను పలకరిస్తూ కనిపించడం డిలైట్ ఫుల్ గా వుంది. తన  చిరునవ్వు పోస్టర్‌కి పర్ఫెక్ట్ టచ్ యాడ్ చేసింది.ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
'మా నాన్న సూపర్‌హీరో' మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్ ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా.  ధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల  క్రియేటివ్ ప్రొడ్యూసర్.
 
MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రానికి కో రైటర్స్. రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రాఫీతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు.  
 
తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత్తువదలరా2 ప్రభాస్ కు జెన్యూన్ గా నచ్చి అంత టైం స్పెండ్ చేశారు : హీరో శ్రీ సింహ