Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్ల ముందే కన్నతల్లికి ప్రమాదం.. ఆ బాలిక ఆటోను పైకెత్తేసింది.. వీడియో

Advertiesment
Brave Girl

సెల్వి

, సోమవారం, 9 సెప్టెంబరు 2024 (12:37 IST)
Brave Girl
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కళ్ల ముందే కన్నతల్లికి ప్రమాదం జరిగితే ఓ బాలిక కన్నీళ్లు పెట్టుకోకుండా ఆటోను తానై పైకి లేపేసింది. ఆపై అమ్మను కదిలించింది. తల్లిని కాపాడేందుకు చాకచక్యంగా వ్యవహరించింది. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. కిన్నిగోళి రామనగర్‌లో రోడ్డుకు అవతలివైపు నుంచి ఇటువైపు ఉన్న కూతురు దగ్గరికి రావడానికి ఓ తల్లి రోడ్డు దాటింది. రోడ్డు మధ్యలోకి వచ్చాక దూసుకొస్తున్న ఆటోను గమనించింది. దీంతో రోడ్డు దాటేందుకు పరుగులు పెట్టింది.
 
ఆటో వేగంగా వెళుతుండడంతో బ్రేక్ వేసినా ఆగే పరిస్థితి లేదు. దీంతో హ్యాండిల్‌ను పక్కకు తిప్పి మహిళను తప్పించాలని డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే అతివేగంతో సదరు మహిళను ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. ఆటో మీద పడడంతో మహిళ కేకలు పెట్టింది. 
 
దీన్ని చూసిన బాలిక షాకైనా క్షణాల్లో తేరుకుని అమ్మను కాపాడుకోవడానికి పరుగెత్తుకెళ్లి ఆటోను పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆటోలో ఉన్న ప్రయాణికులు బయటపడి బాలికకు సాయం చేశారు. ఆటోను పైకి లేపి మహిళను కూర్చోబెట్టారు. 
 
గాయాలపాలైన మహిళను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాశం బ్యారేజీ వద్ద చంద్రబాబు.. ఉత్తర కోస్తాకు అలెర్ట్