Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ పేషెంట్‌లా వుంది.. సాయిపల్లవి అదరగొడుతోంది.. శ్రీరెడ్డి (Video)

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (12:49 IST)
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ పేరిట ఆందోళనకు దిగి... ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు మకాం మార్చేసిన శ్రీరెడ్డి మళ్లీ దర్శకులు, నటులపై ఆరోపణలు చేయడం మొదలెట్టింది.


మొన్నటికి మొన్న దర్శకుడు తేజ.. నిన్నటికి నిన్న నటుడు విశాల్‌పై విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం.. హీరోయిన్ కీర్తి సురేష్‌పై పడింది. మహానటి తర్వాత ఆమెకు అంతగా చెప్పుకోదగిన ఆఫర్లు వచ్చినా.. హిట్ కొట్టలేకపోవడంతో బాగా బరువు తగ్గిన కీర్తి సురేష్‌ను శ్రీరెడ్డి ఏకిపారేసింది. ఇంకా ఫిదా హీరోయిన్ సాయిపల్లవిని కొనియాడుతూ పోస్టులు పెట్టింది. 
 
కీర్తి సురేష్ తాజాగా బోనీ కపూర్ నిర్మించే సినిమాలో నటించనుంది. బాలీవుడ్ సినిమా కోసం కీర్తి సురేష్ భారీగా బరువు తగ్గింది. అయితే కీర్తి సురేష్ సన్నబడటాన్ని శ్రీరెడ్డి హేళన చేసింది. కీర్తి సురేష్ ప్రయాణించిన విమానంలో తాను ప్రయాణం చేశానని.. తనతో పాటు ఎవ్వరూ కీర్తి సురేష్‌ను పట్టించుకోలేదని చెప్పింది. అంతేకాకుండా ఫ్యాన్స్ తనతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారని శ్రీరెడ్డి వెల్లడించింది. 
 
కీర్తి సురేష్ సన్నబడటం ద్వారా పేషెంట్లా వుందని.. మహానటి సినిమాలో కీర్తి సురేష్‌ను నటింపజేసిన ఘనత దర్శకుడిదేనని.. కీర్తి సురేష్‌లో ఎలాంటి ప్రతిభ లేదని శ్రీరెడ్డి ఆమెను వివాదానికి లాగింది. ఇంకా ప్రస్తుత హీరోయిన్లలో సాయిపల్లవి అద్భుతంగా నటిస్తున్నట్లు కితాబిచ్చింది. కానీ కీర్తి సురేష్‌పై సెటైర్లు వేసిన శ్రీరెడ్డిపై ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Christmas : చంద్రబాబు, పవన్, జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

Christmas: పౌరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: అదానీతో మనకేంటి సంబంధం.. రక్షణ కేంద్రం ఏర్పాటైంది అంతే: రేవంత్ రెడ్డి

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments