Webdunia - Bharat's app for daily news and videos

Install App

''పాట'' కోసం మహానటి.. దుబాయ్‌కి వెళ్తూ ఫోటోకు ఫోజు.. వైరల్

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (16:05 IST)
Keerthy Suresh
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా ఆపై దుబాయ్‌లో ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరిస్తారు. ఇందుకోసం కీర్తిసురేష్‌ దుబాయ్‌కి బయలు దేరింది. ఈ విషయాన్ని కీర్తిసురేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తూ మెసేజ్‌ను పోస్ట్‌ చేసింది. 
 
సర్కారువారిపాట సినిమా షూటింగ్‌ షురూ అవుతుందని, చాలా ఎగ్జయిటింగ్‌ ఉందని కీర్తిసురేష్‌ ఫొటోతో పాటు షేర్‌చేసిన మెసేజ్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మహానటి తర్వాత ఎక్కవగా హీరోయిన్‌ సినిమాలకే ఓటు వేస్తూ వచ్చిన కీర్తిసురేష్‌కు .. ఆమె చేసిన ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ ఏవీ కలిసి రాలేదు. ఆ టైమ్‌లోనే సూపర్‌స్టార్‌ మహేశ్‌తో 'సర్కారు వారి పాట' సినిమాలో అవకాశం వచ్చింది. 
 
కమర్షియల్‌ సినిమా అయినప్పటికీ కీర్తిసురేష్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాలో నటించడానికి ఓకే చెప్పేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్‌ షెడ్యూల్‌ చిత్రీకరణను తొలి షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఇప్పుడు హీరో, హీరోయిన్స్‌ మధ్య సన్నివేశాలను సెకండ్‌ షెడ్యూల్‌లో పూర్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments