సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12వ తరగతుల పరీక్షల టైం టేబుల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్ నిషాంక్ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. మే 4వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
షెడ్యూల్ వివరాల్లోకి వెళితే..
మే 4 నుంచి జూన్ 7 వరకు 10వ తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు.
మే 4 నుంచి జూన్ 11వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి.
మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
జులై 15 తేదీలోగా సీబీఎస్‌ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్- cbse.nic.inలో లాగిన్ కావచ్చు