'లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా...' అంటూ ఆకట్టుకుంటున్న కీర్తిసురేశ్ 'మిస్ ఇండియా' లిరికల్ వీడియో సాంగ్
"పచ్చిపచ్చి మట్టి జల్లె పుట్టుకొచ్చె ఈవేళ
గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేల
గట్టుదాటి పల్లె తేటి పాటే కట్టి పుంఖంలా
పట్టలేని పోలికలోన పడుచునవ్వె తుమ్మెదలా
మా లచ్చ గుమ్మాగుమ్మాడిరా ఓ గోగుల గుంగాడి రా.. ఈ తుమ్మెర కొప్పున సన్నజాజి నవ్వేరా..." అంటూ ఓ అమ్మాయి తన లక్ష్యం గురించి ఎలా కలగందో అందంగా పాట రూపంలో వివరించింది 'మిస్ ఇండియా' యూనిట్. బుధవారం ఈ సినిమా నుండి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యంలో 'లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా...' లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఫోక్ సాంగ్ స్టైల్లో కల్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను శ్రీవర్ధిని ఆలపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది.
‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ నటించిన చిత్రం 'మిస్ ఇండియా'. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో హైబడ్జెట్‌తో రూపొందిన 'మిస్ ఇండియా' నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్ 4న ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ సినిమా విడుదలవుతుంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.