Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిస్ ఇండియా ఊర్వశీ రౌతేల హీరోయిన్‌గా సంపత్ నంది 'బ్లాక్ రోజ్'

Advertiesment
మిస్ ఇండియా ఊర్వశీ రౌతేల హీరోయిన్‌గా సంపత్ నంది 'బ్లాక్ రోజ్'
, మంగళవారం, 18 ఆగస్టు 2020 (17:59 IST)
పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తమ శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పైన పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం: 4గా 'బ్లాక్ రోజ్' సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ, "మేము నిర్మిస్తున్న 'బ్లాక్ రోజ్' చిత్ర యూనిట్‌కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఆగస్ట్ 17 నుండీ నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నాము. రెండు సార్లు మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి, బాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన అందాల భామ ఊర్వశీ రౌతేల తెలుగులో ఎన్ని అవకాశాలు వచ్చినా చేయకుండా 'బ్లాక్ రోజ్' కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి ఈ చిత్రం చేయడానికి అంగీకరించింది.
 
కోవిడ్ టైమ్‌లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది. చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాము." అన్నారు. ఈ చిత్రాన్ని క్రియేట్ చేస్తున్న సంపత్ నంది మాట్లాడుతూ, " షేక్స్‌పియర్ రచించిన 'ద మర్చంట్ ఆఫ్ వెనిస్' లో షైలాక్ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా 'బ్లాక్ రోజ్' తెరకెక్కుతోంది. 'విచక్షణ లేని యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం' అనే కౌటిల్యుడి అర్థ శాస్త్రం లోని కాన్సెప్ట్‌ను జోడిస్తూ 'బ్లాక్ రోజ్'ను నిర్మిస్తున్నాం." అన్నారు
 
రచన: సంపత్ నంది, మోహన్ భరద్వాజ్, ఆర్ట్ డైరెక్టర్: ఆచార్య సత్యనారాయణ, ఎడిటర్: తమ్మిరాజు, పి ఆర్ ఓ: బి. ఏ. రాజు, డి ఓ పి: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, క్రియేటెడ్ బై: సంపత్ నంది, దర్శకత్వం: మోహన్ భరద్వాజ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవన్నీ పుకార్లేనట.. వెంటిలేటర్‌పైనే ఎస్.పి. బాలు : తనయుడు ఎస్పీ.చరణ్