Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లోనే ఆ ముచ్చట తీర్చుకుంటూ అదరగొడుతున్న రాశీఖన్నా

Advertiesment
ఇంట్లోనే ఆ ముచ్చట తీర్చుకుంటూ అదరగొడుతున్న రాశీఖన్నా
, మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:58 IST)
నటుడు అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది అందాల తార రాశీఖన్నా. తను చేసిన మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడం, నటిగా కూడా రాశీఖన్నాకు మంచి పేరు రావడంతో వరుసగా సినిమాలు ఆఫర్స్ వచ్చాయి.
 
సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. కానీ ఆ తరువాత ఈ అమ్మడికి వరుసగా ప్లాప్స్ వచ్చాయి. గత ఏడాది వెంకీమామ, ప్రతిరోజూ పండగే చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. రాశీ ఖన్నా ఎంతమంచి హీరోయినో అంత మంచి గాయని కూడా. ఆమె మొదటిసారిగా తను నటించిన జోరు సినిమాలో టైటిల్ సాంగ్ పాడి అందర్ని ఆశ్చర్యపరిచింది.
 
ఇక తర్వాత బాలకృష్ణుడు సినిమాలో మరో పాట పాడింది. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన జవాన్ సినిమాలో ఓ పాటను పాడి ఆశ్చర్యపరిచింది. ఈ భామ ప్రస్తుతం కరోనా వలన సినిమా షూటింగ్‌లు బంద్ కావడంతో ఇంట్లోనే ఉంటున్నా రాశీ, హుషారు చిత్రంలోని ఉండిపోరాదే.. అనే ఓ పాపులర్ పాడుతూ గిటార్‌ను వాయిస్తూ అదరగొట్టింది. ఆమె పాటకు సోషల్ మీడియాలో నెటిజన్లు ముగ్దులవుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ బారినపడిన మరో ఇద్దరు సింగర్స్... ఎవరువారు?