సింగర్ సునీత మేనల్లుడిని అని చెప్పి చైతన్య అనే వ్యక్తి అవకాశాలు ఇప్పిస్తాంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇలాంటి మోసాలకు పాల్పడుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న సునీత వెంటనే తన ఫేస్‌బుక్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తనకు చైతన్య అనే మేనల్లుడు లేడని, దయచేసి ఎవరూ అతని వలలోపడి మోసపోవద్దని ఇటీవల కోరారు. ఇలాంటి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అవకాశాల పేరుతో దోచుకునే వారిని నమ్మొద్దని సింగర్ సునీత విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చైతన్య అనే వ్యక్తి వసూళ్లకు పాల్పడుతున్నాడన్న కేసులో పోలీసులు చైతన్యను అరెస్ట్ చేశారు. సినిమాల్లో అవకాశాల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతూ, మోసాలు చేస్తున్న చైతన్య ఎవరో తనకు తెలియదని, అలాంటి వాడు కనపడితే చెప్పుతో కొట్టాలంటూ సింగర్ సునీత ఇప్పటికే వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురంకు చెందిన చైతన్యను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్య గత చరిత్ర, ఎందుకు సింగర్ సునీత పేరు వాడుకున్నారు, ఎవరెవరి వద్ద ఎంతెంత వసూలు చేశారు అన్న అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు.