Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ బయోపిక్ ప్రారంభం.. ఆ రోల్‌లో ప్రకాష్ రాజా? నాజరా?

బాలీవుడ్ తరహాలో ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. మహానటి హిట్ కొట్టాక, మహానటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జీవిత కథ ఆ

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (16:22 IST)
బాలీవుడ్ తరహాలో ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. మహానటి హిట్ కొట్టాక, మహానటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జీవిత కథ ఆధారంగానూ ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.


ఎన్టీఆర్ బయోపిక్‌కు క్రిష్ దర్శకత్వం వహించనుండగా, బాలకృష్ణ టైటిల్ రోల్లో మెరవనున్నారు. అటు దిగవంతనేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రారంభమైంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్‌గా నటిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ గురువారం(జూన్ 28) లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. 
 
మొదట్లో కేసీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తారని ప్రచారం జరిగినా, చివరకి విలక్షణ నటుడు నాజర్‌ని ఫైనల్ చేశారట. ''ఉద్యమ సింహం'' అనే పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని కృష్ణం రాజు తెరకెక్కించనున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్ రావు నిర్మాణ సారథ్యం వహించనున్నారు. తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments