Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌ను వచ్చేయమంది... చివరికి ఏం చూపించిందో తెలుసా...?

ఫేస్‌బుక్‌లో ఓ అందాల సుందరి ఓ ఆహ్వానాన్ని పోస్ట్ చేసింది. త్వరలో ఓ ఇంటిదాన్ని అవుతున్నా, అందరూ వచ్చేయండి అని ఊరించింది. ఈ పోస్ట్‌పై పలు ఛానెళ్లలో, వెబ్‌సైట్లలో చాలా వార్తలు హల్‌చల్ చేసాయి. తొందర్లోనే చిరునామా ఇచ్చేస్తాను, అందరూ వచ్చేయండి అంటూ ఆశపెట్ట

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (18:05 IST)
ఫేస్‌బుక్‌లో ఓ అందాల సుందరి ఓ ఆహ్వానాన్ని పోస్ట్ చేసింది. త్వరలో ఓ ఇంటిదాన్ని అవుతున్నా, అందరూ వచ్చేయండి అని ఊరించింది. ఈ పోస్ట్‌పై పలు ఛానెళ్లలో, వెబ్‌సైట్లలో చాలా వార్తలు హల్‌చల్ చేసాయి. తొందర్లోనే చిరునామా ఇచ్చేస్తాను, అందరూ వచ్చేయండి అంటూ ఆశపెట్టిన అమ్మడు హోల్‌సేల్‌గా అందర్నీ ఉస్సూరనిపించింది. ఆమె మరెవరో కాదు - కైపు కళ్ల కైఫ్.. కాదు కత్తి కైఫ్.. కాదు కాదు.. కత్రినా కైఫ్...
 
అడ్రస్ చెప్పమంటూ అభిమానులు కామెంట్ల సునామీతో విరుచుకుపడినా నింపాదిగా గడిపిన కత్రినా చివరికి ఆ అడ్రస్ చెప్పనే చెప్పింది. కానీ అది ఇంటి చిరునామా కాదు.. ఫోటో బ్లాగింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ చిరునామా - katrinakaif_official. ఇంతగా ఊరించినా, నిరాశ చెందని అభిమానులు అక్కడ సైతం ఆమెకి బ్రహ్మరథం పట్టి, ఆమె పట్ల గల అభిమానాన్ని చాటుకున్నారు. ఒక్క రోజైనా కాకముందే ఆ సైట్‌లో ఆమెను ఇప్పటికే ఇప్పటికే రికార్డు స్థాయిలో 691000 మంది ఫాలో అవుతున్నారు మరి. 
 
ప్రస్తుతం పాత ప్రియుడు రణ్‌బీర్‌తో జగ్గా జాసూస్, అంతకంటే పాత ప్రియుడు సల్మాన్‌తో టైగర్ జిందాహైలో నటిస్తున్న కైఫ్ షారూఖ్‌ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న మరో చిత్రంలో కూడా కనిపించనుంది. చూద్దాం.. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత ఐనా అభిమానుల కోరికను ఈ కైపు కళ్ల సుందరి నెరవేర్చుతుందేమో.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments