Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2 ఇంటర్వెల్ సీన్ లీకైందట.. ఇదిగోండి వీడియో..

నిజంగానా? బాహుబలి ఇంటర్వెల్ సీన్ లీకైందట. బాహుబలి-2 ది కన్‌క్లూజన్ వరుస రికార్డులతో దూసుకెళ్తోంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ పోర్టల్‌లో విక్రయ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (17:44 IST)
నిజంగానా? బాహుబలి ఇంటర్వెల్ సీన్ లీకైందట. బాహుబలి-2 ది కన్‌క్లూజన్ వరుస రికార్డులతో దూసుకెళ్తోంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ పోర్టల్‌లో విక్రయానికి పెట్టడంతో, ప్రేక్షకులు ఆన్ లైన్ పోర్టల్‌కు పోటెత్తారని, దీంతో కేవలం 24 గంటల్లోనే పది లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది సినీ చరిత్రలో రికార్డని విక్రేతలు వెల్లడించారు. 
 
భారీ బడ్జెట్‌తో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2  సినిమాకు చెందిన పలు సీన్లు ఇప్పటికే లీకైపోయి ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయ‌ని ఎన్నో వార్త‌లు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా బాహుబ‌లి జోకులు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీటిలో బాహుబలి ఇంటర్వెల్ సీన్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో విప‌రీతంగా ఆస‌క్తి రేపుతోంది. ఈ వీడియోను చూసి కొన్ని క్ష‌ణాల పాటు నిజంగానే బాహుబ‌లి ఇంట‌ర్వెల్ సీన్ లీకై పోయింద‌ని నెటిజన్లు భావిస్తున్నారు. 
 
అయితే ఈ వీడియోలో శివగామి గెటప్‌లో రమ్యకృష్ణ ముందుగా కనబడుతోంది. దీంతో బాహుబలి-2 సంబంధించిన వీడియో అనుకుని నెటిజన్లు కొన్ని క్షణాలు షాక్ అయ్యారు. కానీ వీడియో ఏడాది క్రితం టీవీల్లో వచ్చిన ఓ యాడ్‌కు సంబంధించిందని అర్థ‌మైపోయి విర‌గ‌బ‌డి నవ్వుకుంటున్నారు.

బాహుబ‌లి క్రేజుని క్యాష్ చేసుకునేందుకు ఈ పాత వీడియోనే బాహుబలి 2 ఇంటర్వెల్‌ సీన్ లీక్ అంటూ పోస్టు చేశార‌ు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments