Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తికేయ-2 విజ‌యం నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం - అభిషేక్ అగ‌ర్వాల్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (18:25 IST)
kartikeya team
హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం కార్తికేయ‌ 2. నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన కార్తికేయ -2 చిత్రం ఘనవిజయం సాధించింది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సంధర్బంగా కార్తికేయ- 2 చిత్ర బృందం థాంక్స్ మీట్ ను నిర్వహించారు.  
 
నిర్మాత‌ల్లో ఒక‌రైన అభిషేక్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ, కార్తికేయ-2 విజ‌యం నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. విడుద‌లైన ప్ర‌తిచోట్ల, ఓవ‌ర్‌సీస్‌లోనూ మంచి ఆద‌ర‌ణ పొందుతోంద‌ని తెలిపారు.
 
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..  దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే, అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతూ కార్తికేయ సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..  రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా మర్చిపోయాను. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది నేను చాలా ఎమోషనల్ ఐపోయాను. చాలా సంతోషంగా ఉంది. థాంక్స్ ఫర్ యూ సపోర్ట్. 
 
హీరో నిఖిల్ మాట్లాడుతూ, ఈ సినిమాకి యూఎస్ ముందుగానే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రిజల్ట్ కోసం వెయిట్ చేసాం. ఇక్కడ సినిమా అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్నీ చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. నా సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. రేపు ఎల్లుండి కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఇది ఇలానే కొనసాగుతుంది అని నేను అనుకుంటున్నాను. చందు మంచి పాయింట్ తీసుకుని అద్భుతంగా తీసాడు అని చెబుతూ కార్తికేయ టెక్నీషియన్స్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments