Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక దీపం సీరియల్ హాట్ టాపిక్ ఇదే.. నేను మౌనితను పెళ్లి చేసుకుంటా..?

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (12:23 IST)
Karthika Deepam
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ మరింత రసవత్తరంగా మారింది. గురువారం నాటి ఎపిసోడ్‌ నిన్నటి ఎపిసోడ్‌లో నీ మీద పడ్డ నిందను అబద్దమని నిరూపించుకో వదినా అంటూ దీపకు ఆదిత్య సలహా ఇవ్వగా.. నేను అదే పనిలో ఉన్నానంటూ దీప చెప్పుకొస్తుంది. మరోవైపు హిమ ఎండలో ఇబ్బంది పడటాన్ని దూరం నుంచి చూస్తూ ఉండే కార్తీక్.. లోలోపల బాధపడుతాడు. 
 
ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏమని చెప్పి వచ్చావురా దానికి అంటూ ఆదిత్యను సౌందర్య అడుగుతుంది. తిరగబడమని చెప్పవా..? కోర్టుకు ఎక్కమన్నావా..? పంచాయితీ పెట్టించమని చెప్పావా..? అని సౌందర్య ప్రశ్నిస్తుంది. మీరు ఇన్ని రోజులు చెప్పనిదే చెప్పి వచ్చాను మమ్మీ.. వదిన మీద పడ్డ నిందను చెరుపుకోమని చెప్పా అని చెబుతాడు. ఆ నింద అబద్ధమని తేలితే తప్ప అన్నయ్య, వదినను నమ్మడు. అది అబద్దమని నేను నిరూపిస్తాను మమ్మీ అని అంటాడు. అదే సమయానికి ఇంట్లోకి వచ్చిన కార్తీక్.. ఆ పని చేయిరా అంటాడు.
 
నిజంగా అడుగుతున్నాను ఆదిత్య. అది అబద్ధమని నిరూపించు. ఆ తరువాత నేను హిమను ఇక్కడికి తెచ్చుకుంటా. ప్రపంచమంతా కాదు నేను నమ్మితే చాలు అని చెబుతాడు. ఇది హిమ సమస్య ఒక్కటే కాదురా అని ఆనందరావు అడగ్గా.. కానీ హిమ బలైపోయింది. దానికి కారణం ఎవరు అని అంటాడు. నేను.. అందులో హిమ తప్పు ఏం లేదు అని చెబుతుంది. 
 
దానికి కార్తీక్.. ఆ పసిదాని తప్పు ఉందని నేను చెప్పడం లేదు. అందుకే నేను నరకం చూస్తున్నా. కన్నది అది. పెంచిది నేను. ఎత్తుకొచ్చింది నువ్వు. నిజం దాచింది మీరు. లోకం తెలియని పసిదాన్ని తెచ్చి నా చేతిలో పెడితే దాని తప్పు ఎలా అవుతుంది అని కార్తీక్ అంటాడు. మరి దీప మీద అంత సానుభూతి ఉంటే.. దాన్ని ఇక్కడకు తీసుకురావొచ్చుగా. పెంచిన ప్రేమను చంపుకోవడం ఎందుకు అని ఆనందరావు అడుగుతాడు. పెంచడానికి, రక్తం పంచడానికి చాలా తేడా ఉంటుంది అని కార్తీక్ చెబుతాడు.వెంటనే సౌందర్య.. అందుకని హిమకు శిక్ష వేస్తావా..? అని అంటుంది. 
 
ఆ తరువాత కార్తీక్.. ఆదిత్య నిజంగా అడుగుతున్నాను. మీ వదిన ఏ తప్పు చేయలేదని నువ్వు నిరూపిస్తావా..? అని అంటాడు. నేను నిరూపిస్తాను రా. నా కోడలు నిప్పు అని నేను నిరూపిస్తా అని సౌందర్య అనగా.. నీ మీద నాకు నమ్మకం లేదు. నువ్వు నిజాలను దాచిపెడతావు. అబద్దాలను బతికిస్తావు. నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. ఆ రోజు నువ్వు ఆ బిడ్డను తీసుకురాకుండా ఉండి ఉంటే.. ఇంత మమకారం పెంచుకునేదాన్ని కాదు. 
 
కనీసం సౌర్యను చూసినట్లు అయినా చూసేవాణ్ణి. ఎంతోకొంత సాయం చేసేదాన్ని. ఇలా గాయం చేసేవాణ్ణి కాదు అని చెబుతాడు. అయినా ఇందులో దీప తప్పు ఏం లేదు. ఎందుకంటే నువ్వు ఎత్తుకొచ్చినది దానికి తెలీదు కదా. ఆదిత్య ఆ నింద అబద్దమని నిరూపించు. నిజమని తేలితే మాత్రం నేను మౌనితను పెళ్లి చేసుకుంటా అని పెద్ద బాంబు వేస్తాడు కార్తీక్. ప్రస్తుతం మౌనితను పెళ్లి చేసుకుంటానని కార్తీక్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments