Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సర్దార్‌'గా వస్తానంటున్న హీరో కార్తీ

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (16:28 IST)
ఇటీవలే సుల్తాన్‌గా వచ్చిన హీరో కార్తి ఇపుడు సర్దార్‌గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఆయన నటించే కొత్త చిత్రానికి సర్దార్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తమిళ హీరో సూర్య తమ్ముడుగా వెండితెరకు పరిచయమైన కార్తి... వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ విల‌క్ష‌ణ పాత్ర‌లు పోషిస్తున్న కార్తీ రీసెంట్‌గా 'సుల్తాన్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. 
 
ఇక ఇప్పుడు విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాలతో తమిళ్, తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌ర్ధార్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, రాజీషా విజయన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 
 
తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో కార్తి ఒత్తైన జుట్టు, గుబురు గెడ్డంతో ఓల్డ్ గెటప్‌లో క‌నిపించి అంద‌రిలో సినిమాపై ఆసక్తిని పెంచాడు. ముఖ్యంగా, తన నిజ వయసుకంటే.. పెద్ద వయసు పాత్రలో నటిస్తున్నట్టు ఈ ఫస్ట్ లుక్‌ను చూస్తుంటే తెలుస్తోంది. 
 
గ‌త సినిమాల‌లో మంచి పాయింట్స్‌తో ఆస‌క్తి రేకెత్తించిన మిత్ర‌న్ ఈ సినిమాతోను అల‌రించ‌నున్నాడ‌ని పోస్ట‌ర్ చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. జీవీ ప్ర‌కాశ్ చిత్రానికి సంగీతం అందించ‌నుండ‌గా, ఈ సినిమాకి కెమెరా : జార్జ్ సి విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, లిరిక్స్ : యుగభారతి అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూగుల్ ఫారమ్‌ను షేర్ చేసిన జనసేన..

మెగాస్టార్‌ చిరంజీవికి సత్కారం.. మళ్లీ నంది అవార్డుల ప్రకటన

ప్రతిరోజూ రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ షట్ డౌన్

కేబినెట్ మీటింగ్.. ఒకే రోజు ఆరు హామీలపై ఆమోదం..

వాకింగ్ వెళ్లిన దంపతులను తరుముకున్న గజరాజు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments