Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అజిత్ అంటే చాలా ఇష్టం.. జయలలితలా పెళ్లి చేసుకోను: శ్రీరెడ్డి

టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులను ఓ ఆటాడుకుంటోంది... శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె అర్ధనగ్ర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి మళ్లించిన శ్రీరెడ్డి.. ప్రము

Webdunia
గురువారం, 19 జులై 2018 (15:42 IST)
టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులను ఓ ఆటాడుకుంటోంది... శ్రీరెడ్డి. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై ఆమె అర్ధనగ్ర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి మళ్లించిన శ్రీరెడ్డి.. ప్రముఖ దర్శకులు మురుగదాస్, సుందర్ సి, రాఘవ లారెన్స్, నటుడు శ్రీకాంత్‌పై విమర్శలు గుప్పించింది. చికాగో సెక్స్ రాకెట్ బండారం బయటపడిన నేపథ్యంలో.. శ్రీరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
అగ్ర హీరోయిన్లు స్వదేశంలో నటించడం కంటే విదేశాల్లో వ్యభిచారానికి పాల్పడి... ఒకే ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఒక వారంలోనే ఆర్జిస్తున్నారని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ మండిపడ్డాడు. అగ్ర హీరోయిన్లు నోరు తెరిస్తే.. గుండెపోటుతో చస్తావని ఫైర్ అయ్యాడు. అందుకు శ్రీరెడ్డి ధీటుగా సమాధానమిచ్చింది. ఆ అగ్రహీరోయిన్లు నోరు తెరిస్తే.. తన కంటే అధికమైన వారితో పడక పంచుకుని వుంటారని షాకిచ్చే బదులిచ్చింది. ఇంకా ఫేస్‌బుక్‌లో కొందరి నటీమణుల పేర్లను శ్రీరెడ్డి పోస్టు చేసింది. వారి పేర్లలోని ముందు, చివరి అక్షరాలను పోస్టు చేసింది. 
 
తాజాగా యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు నచ్చిన నటుడు అజిత్ అంటూ చెప్పింది. తమిళ హీరోల్లో అజిత్ అందం, నటన, ఆకారం బాగుంటాయి. ఓ నటుడి వుండాల్సిన అర్హతలు, లక్షణాలన్నీ ఆయనలో వున్నాయని శ్రీరెడ్డి తెలిపింది. ఇంకా తమిళనాడు మాజీ సీఎం జయలలిత తనకు స్ఫూర్తి అని శ్రీరెడ్డి తెలిపింది. జయలలిత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అయినా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. జయలలితలా తాను కూడా వివాహం చేసుకునేది లేదని.. తన జీవితాన్ని మహిళాభివృద్ధి కోసం త్యాగం చేస్తానని తెలిపింది. సామాజిక సేవలో పాలుపంచుకుంటానని చెప్పుకొచ్చింది. 
 
ఇదిలా ఉంటే.. చినబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ శ్రీరెడ్డి వివాదంపై స్పందించారు. శ్రీరెడ్డి దర్శకులు, నటులపై ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారని.. ఆమె చేస్తున్న విమర్శలకు ఆధారాలు కావాలన్నారు. నిజానికి శ్రీరెడ్డితో దర్శకులు, నిర్మాతలు నష్టపోయారని.. ఒకవేళ శ్రీరెడ్డిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని కార్తీ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం