Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ బయోపిక్‌'కు గ్లామర్ టచ్.. మోక్షజ్ఞ సరసన రకుల్

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ తారాగణంతో భారీగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్

Webdunia
గురువారం, 19 జులై 2018 (15:38 IST)
స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం భారీ తారాగణంతో భారీగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ను తీసుకోగా, శ్రీదేవి పాత్రకోసం రకుల్‌ను ఎంపిక చేశారు.
 
ఇకపోతే, ఎన్టీఆర్‌తో ఎక్కువ చిత్రాలలో నటించిన హీరోయిన్స్ జాబితాలో జయసుధ, జయప్రదలు కూడా ఉన్నారు. ఈ ఇద్దరు ఎన్టీఆర్‌తో అనేక హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో జయసుధ, జయప్రద పాత్రల కోసం నవతరం హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారట. శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ ఎంపిక కావడంతో బయోపిక్‌కు గ్లామర్ వచ్చింది. ఇప్పుడు జయసుధ, జయప్రద పాత్రలకు నవతరం హీరోయిన్స్‌ను ఎంపిక చేస్తే.. బయోపిక్‌కు మరింత గ్లామర్ వచ్చినట్టే. 
 
ఇకపోతే, ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఙ ఆరంగేట్రం చేస్తున్న విషయం తెల్సిందే. చిత్రంలో ఎన్టీఆర్ చిన్న‌త‌నానికి సంబంధించిన స‌న్నివేశాల‌లో మోక్ష‌జ్ఞ క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆమె పాలు అమ్మే మహిళ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో కూడా పాల్గొంటుంద‌ట‌. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నా వదినా అంటూ నా ప్రియుడితో సరసాలా? ముక్కోణపు ప్రేమలో యువతి మృతి

ప్రేమ వివాహాలకు వేదిక కానున్న సీపీఎం కార్యాలయాలు!!

నేడు, రేపు తెలంగాణాలో భారీ వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments