Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీ.. కస్తూరీల సెల్ఫీ రచ్చ.. అలాంటప్పుడు కాస్త పర్మిషన్ అడగండయ్యా?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:40 IST)
తమిళ్ హీరో కార్తి తెలుగునాట కూడా సుపరిచితమైన హీరోనే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలై విజయం సాధించాయి. కార్తి తండ్రి శివకుమార్ కూడా ఒకప్పుడు హీరోనే. ప్రస్తుతం కొడుకులైన సూర్య, కార్తీ నటనను ఆస్వాదిస్తున్న ఈయన ఆ మధ్యకాలంలో సెల్ఫీ విషయంలో చేసిన గొడవ సంచలనమైంది. ఈ విషయంగా ఒకప్పటి హీరోయిన్ కస్తూరి, కార్తీ మధ్య ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. 
 
ఇటీవల చెన్నైలో జరిగిన జులై కాట్రిల్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు కార్తీ అతిథిగా వచ్చాడు. ఆ ఈవెంట్‌కు వచ్చిన నటి కస్తూరి కార్తీ వేదికపైకి వస్తున్న సమయంలో కార్తితో సెల్ఫీ తీసుకుంటూ..మీ నాన్న ఇక్కడ లేడు.. త్వరగా సెల్ఫీ తీసుకుందాం అంటూ సరదాగా జోక్ చేసింది. ఇక సోషల్ మీడియాలో దీని గురించి ట్రోలింగ్ మొదలైంది.
 
ఈ సెటైర్లపై స్పందిస్తూ "జనాలకు మర్యాద లేకుండా పోయింది, సెల్ఫీ తీసుకోవాలంటే అవతలి వ్యక్తి అనుమతి అడగాలనే జ్ఞానం లేకుండా పోయింది. అవతలి వ్యక్తి ఇబ్బందులను పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు మీద పడిపోతుంటారు. ఇది చాలదన్నట్లు స్మార్ట్ ఫోన్స్‌లో ఇప్పుడు ముందొక ఫ్లాష్, వెనుకొక ఫ్లాష్ ఇస్తున్నారు. దీంట్లో నుండి వచ్చే వెలుతురు వలన పెద్దవారికి కంటినొప్పి, తలనొప్పి సమస్యలు వస్తాయి" అని వివరించారు. ఇక కార్తీ స్పీచ్ తర్వాత కస్తూరి కూడా అభిమానులు కాస్త డీసెంట్‌గా బిహేవ్ చేయాలని, అనుమతి అడిగి సెల్ఫీ తీసుకోవడం మంచిదని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments