Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌషల్‌కు చెక్ పెట్టడానికి మెగాస్టార్ రంగంలోకి దిగారా...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:06 IST)
బిగ్ బాస్ సీజన్-1తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్-2 వివాదాలతో మంటి టిఆర్‌పి సాధించింది. సీజన్ ముగిసిపోయినప్పటికీ కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు సద్దుమణగడానికి బదులుగా నానాటికీ ఇంకా పెరిగిపోతున్నాయి. ఇటీవల కౌషల్‌కు ఆర్మీ ఎదురుతిరగడంతో మొదలైన గొడవ తారాస్థాయికి చేరుకుంది. అయితే తాజాగా ఈ వివాదంలో చిరంజీవి పేరు వినిపిస్తోంది.
 
కౌషల్ విరాళంగా వచ్చిన నిధులను దుర్వినియోగం చేసినట్లు, అభిమానులను దూషించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కౌషల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ నాపై జరుగుతున్న కుట్రకు బాబు గోగినేని, తనీష్‌లు కారణమని చెప్తూ తనీష్ ఫోటో ఒకటి షేర్ చేసారు. అంతేకాకుండా తనకు వచ్చిన సినిమా ఆఫర్‌ను కూడా చెడగొట్టారని ఆరోపించారు.
 
ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తనీష్ బిగ్ బాస్ తర్వాత తాను మీడియాలో ఒక్క మాట కూడా మాట్లాడలేదని, నన్ను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారు, ఈ ఆరోపణలను రుజువు చేయమని సవాల్ చేసాడు. దీని వలన తాను, తన కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని, కనుక అతనికి లీగల్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు.
 
ఈ క్రమంలో సోషల్ మీడియా తనీష్ పెట్టిన పోస్ట్, షేర్ చేసిన ఫోటో గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. చిరంజీవితో కలిసి తీసుకున్న ఫోటో పోస్ట్ చేస్తూ "మై వన్ అండ్ ఓన్లీ ఇన్సిపిరేషన్. ఆయన సాంగ్స్ చూస్తూ డ్యాన్స్ స్టెప్పులు నేర్చుకొనేవాడిని. దాదాపు 16 ఏళ్ల తర్వాత కలిశాను. ఈ రోజును ఎన్నటికీ మరువలేను" అని ఉద్వేగం చెందారు. అసలు తనీష్ ఇప్పుడు మెగాస్టార్‌ను ఎందుకు కలిశారు. కౌషల్ వివాదంలో తనకు సహాయం చేయమని కోరడానికి ఆయనను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments