Webdunia - Bharat's app for daily news and videos

Install App

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

దేవీ
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (16:50 IST)
Nagamahesh, Manjula Chavan
నాగ‌మ‌హేష్, రూపాలక్ష్మి, 'బాహుబ‌లి' ప్ర‌భాక‌ర్, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు ప్రధాన పాత్ర‌ల్లో, ర‌మేష్ అనెగౌని ద‌ర్శ‌క‌త్వంలో, మంజుల చ‌వ‌న్, ర‌మేష్‌గౌడ్ అనెగౌని నిర్మాత‌లుగా, రామారాజ్యం మూవీ మేక‌ర్స్, అనంతల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'క‌ర్మ‌ణి'. ఈ మూవీ తాజాగా ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది.
 
ఈ సంద‌ర్భంగా దేవుని చిత్ర‌ప‌టాల‌పై సీనియ‌ర్ న‌టుడు నాగమ‌హేష్ క్లాప్ కొట్టారు. నిర్మాత మంజుల చ‌వ‌న్ కెమెరా స్విచాన్ చేశారు.
 
2022లో డైరెక్ట‌ర్ ర‌మేష్ అనెగౌని తెర‌కెక్కించిన‌ 'మ‌న్నించ‌వా..' మూవీకి అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆధర‌ణ ల‌భించింది. అదే ఉత్సాహంతో, అదే టీమ్‌తో క‌లిసి చేస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ 'క‌ర్మ‌ణి'. ఈ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ర‌మేష్ అనెగౌని మాట్లాడుతూ.. ''ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ప్రొరంభోత్స‌వం జ‌రిగే సినిమాలు సూప‌ర్ హిట్ కొడ‌తాయి. ఈ సెంటిమెంట్ మా  'క‌ర్మ‌ణి' సినిమాకు కూడా క‌లుగుతుంద‌ని విశ్వాసం ఉంది. మే మొద‌టి వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌ప‌రుస్తాం''. అని అన్నారు.  
 
నిర్మాత మంజుల చ‌వ‌న్ మాట్లాడుతూ.. ''ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో మా  'క‌ర్మ‌ణి' సినిమా ప్రొరంభోత్స‌వం జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. మంచి టాలెంట్ ఉన్న టీమ్‌తోనే సినిమా చేస్తున్నాం. ఇండ‌స్ట్రీకి ఒక మంచి సినిమా అందిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాం.'' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments