2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

ఠాగూర్
శనివారం, 15 నవంబరు 2025 (10:23 IST)
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుటుంబంలో ఆస్తి వివాదం కోర్టులో ఉంది. ఈ కేసుపై శుక్రవారం ఢిల్లీలో విచారణ జరిగింది. ఈ  సందర్భంగా కరిష్మా కపూర్ పిల్లలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ చదువుకు సంబంధించి రెండు నెలలుగా యూనివర్శిటీ ఫీజులు చెల్లించలేదని వారు పేర్కొన్నారు. 
 
కరిష్మా కపూర్‌కు సమైరా, కియాన్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి తరపున సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జఠ్మలాని వాదనలు వినిపించారు. కరిష్మా పిల్లల విద్యా ఖర్చులకు నిధులు సమకూర్చే బాధ్యత సంజయ్‌ కపూర్‌కు ఉందన్నారు. 
 
ఆస్తి ప్రస్తుతం ప్రియా సచ్‌దేవ్‌ నియంత్రణలో ఉందని.. అమెరికాలో చదువుతున్న సమైరాకు రెండు నెలలుగా ఫీజు చెల్లించలేదని తెలిపారు. అయితే, ప్రియా సచ్‌దేవ్‌ తరపున న్యాయవాది రాజీవ్‌ నాయర్‌ ఈ వాదనలను తోసిపుచ్చారు. ఇవి కల్పితమైనవని, ప్రియా నిరంతరం కరిష్మా పిల్లలకు సాయం అందుతోందని కోర్టుకు తెలిపారు. 
 
ఫీజుకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే చెల్లించినట్లు తెలిపారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఈ అంశాన్ని కోర్టులో లేవనెత్తినట్లు పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న జస్టిస్ జ్యోతిసింగ్ కేసుపై అసహనం వ్యక్తంచేశారు. కేసు విచారణను మెలోడ్రామాగా మార్చొద్దని హెచ్చరించారు. ఇలాంటి కేసులు కోర్టు వెలుపల పరిష్కారమవుతాయని, వాటిని మళ్లీ బెంచ్‌ ముందుకు తీసుకురావద్దని రాజీవ్‌ నాయర్‌ను ఆదేశించారు. 
 
కాగా, గత 2003లో కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్‌ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సంజయ్‌కు చెందిన రూ.30 కోట్ల విలువైన ఆస్తుల్లో తమ వాటా కోసం కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments