Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ నుంచి బైటకు రావడం నాపై కుట్రేనని అనుమానం - కరాటే కళ్యాణి (video)

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (16:45 IST)
కరాటే కళ్యాణి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపు వలనే బిగ్ బాస్ 4లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అయితే... కరాటే కళ్యాణి బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులే ఉంటుంది అనుకుంటే... ఊహించని విధంగా తక్కువ రోజుల్లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మీడియాతో మాట్లాడుతూ.. కళ్యాణి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
 
ఇంతకీ కరాటే కళ్యాణి ఏం చెప్పిందంటే.. ఎక్కడో మోసం జరిగిందని తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని కామెంట్స్ చేసింది. అంతేకాకుండా.. ఏదో కుట్ర జరుగుతున్నట్లు మొదటి నుంచి నాకు అనుమానం వస్తూనే ఉంది అని చెప్పింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే... బిగ్ బాస్ సీజన్ 1లోనే నేను పాల్గొనాల్సింది. కానీ అప్పుడు రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో ఆఫర్ రావడం వలన బిగ్ బాస్ సీజన్ 1కు ఒప్పుకోలేదు.
 
ఇక బిగ్ బాస్ 4లో పాల్గొనడం నిజంగా చాలా బాధను కలిగించింది. కారణం ఏంటంటే... కంటెస్టెంట్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం వలన మనకు ఇది సెట్ కాదు అనుకున్నాను అని చెప్పారు. హౌస్‌లో తనని చూసి బయటపడ్డారు. నన్ను బయటకు పంపేస్తే.. లైన్ క్లియర్ అవుతుందని అనుకున్నారు. నాకు మొదటి వారం ఓట్లు చాలా తక్కువగా వచ్చాయి.
 
ఒక వారం రోజుల్లోనే మనిషిని జడ్జ్ చేయడం అంత ఈజీ కాదు. నాకు గ్యాప్ లేకుండా, ఫోన్లు, మెస్సేజ్‌లు వచ్చాయి. సూర్యకాంతం లాంటి యాక్టర్ మళ్ళీ పుట్టిందని సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వచ్చాయి అని కరాటే కళ్యాణి చెప్పారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments